Indians deportation: భారతీయుల్ని బహిష్కరించడంలో సౌదీ అరేబియా అమెరికాను మించిపోయింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూఎస్ తన వీసా నిబంధనల్ని కఠినతరం చేసింది. ట్రంప్ వీసా విధానం, ఆ దేశంలో పనిచేస్తున్న భారతీయ వర్కర్లను ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే, ఈ ఏడాది అమెరికా కన్నా , ముస్లిం దేశమైన సౌదీనే ఎక్కువ మంది భారతీయల్ని దేశం నుంచి బహిష్కరించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో సమర్పించిన డేటా ప్రకారం, ఈ సంవత్సరం సుమారు 81 దేశాలు 24,600 మందికి పైగా భారతీయులను బహిష్కరించాయి, కానీ 2025లో కేవలం సౌదీ అరేబియా మాత్రమే 11,000 మందికి పైగా భారతీయులను బహిష్కరించింది.
Read Also: Digvijaya Singh: బీజేపీ-ఆర్ఎస్ఎస్‌పై డిగ్గీరాజా ప్రశంసలు.. కాంగ్రెస్ పరేషాన్..
డేటా ప్రకారం, ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులను (170 మందిని) యూకే డిపోర్ట్ చేసింది. 114 మంది ఇండియన్ స్టూడెంట్స్‌ను ఆస్ట్రేలియా బహిష్కరించి రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రష్యా 82 మందిని, అమెరికా 45 మందిని బహిష్కరించింది. పత్రాలపై కఠిననమైన తనిఖీలు, వీసా స్టేటర్, వర్క్ పర్మిట్, గడువు ముగిసిన తర్వాత కూడా నివసించడం వంటి కారణాల వల్ల ఈ ఏడాది అమెరికా సుమారుగా 3800 మంది భారతీయుల్ని బహిష్కరించింది. అమెరికా సంఖ్యతో పోలిస్తే, సౌదీ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా సౌదీలో నివసిస్తుండటంతో చాలా మంది భారతీయుల్ని అక్కడి ప్రభుత్వం డిపోర్ట్ చేసింది.
