NTV Telugu Site icon

Bodh Gaya Temple: మహాబోధి ఆలయం కింద ‘‘భారీ నిర్మాణ సంపద’’.. శాటిలైట్ చిత్రాలతో వెలుగులోకి..

Bodh Gaya Temple

Bodh Gaya Temple

Bodh Gaya Temple: గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించి నాలుగు పవిత్ర ప్రదేశాల్లో ఒకటిగా ఉన్న బోధ్ గయాలోని మహాబోధి ఆలయం కింద ‘భారీ నిర్మాణ సంపద’ దాగి ఉన్నట్లు శాటిలైట్ సర్వే విశ్లేషన్ ద్వారా ఆధారాలు లభించాయని అధికారులు శనివారం తెలిపారు. యూకే కార్డిఫ్ యూనివర్సిటీ సహకారంతో బీహార్ హెరిటేజ్ డెవలప్మెంట్ సొసైటీ(బీహెచ్‌డీఎస్) ఈ అధ్యయనం చేస్తోంది. మహాబోధి ఆలయ సముదాయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన ప్రదేశం బోధ్ గయ.

యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, దాని పరిసర ప్రాంతాల నేల కింద భారీ పురావస్తు నిర్మాణాలు ఉన్నట్లు అధ్యయనం కనుగొందని, అధికారి హర్జోత్ కౌర్ బమ్రాహ్ చెప్పారు. మహాబోధి ఆలయం మరియు దాని పరిసరాల యొక్క ఉపగ్రహ చిత్రాలను అధ్యయనం చేశామని, కనుగొన్న వాటిని చైనీస్ యాత్రికుడు జువాన్ జాంగ్(హుయత్సాంగ్) చెప్పిన వివరాలతో ప్రస్తుతం కనుగొన్నవాటిని అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు బెంగళూర్‌కి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఫ్యాకల్టీ సభ్యుడు MB రజనీ చెప్పారు.

బోధ్ గయలోని ప్రస్తుత మహాబోధి ఆలయ సముదాయంలో 50 మీటర్ల ఎత్తైన ఆలయం వజ్రాసనం, పవిత్ర బోధి వృక్షం మరియు బుద్ధుని జ్ఞానోదయానికి సంబంధించిన ఇతర ఆరు పవిత్ర స్థలాలు ఉన్నాయి. పరిశోధకులు 7వ శతాబ్దపు చైనీస్ సన్యాసి జువాన్‌జాంగ్ యొక్క భారతదేశ ప్రయాణంపై ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తోంది. ఆలయానికి ఉత్తరాన, భూగర్భం కింద అనేక నిర్మాణాలు ఉన్నట్లు శాటిలైట్ల చిత్రాల విశ్లేషణ ద్వారా తెలిసింది. నిరంజన నది తూర్పు నుంచి పడమరకు మారడాన్ని చిత్రాలు చూపిస్తున్నాయి.

Read Also: Sanjay Raut: ఎమర్జెన్సీకి ఆర్ఎస్ఎస్ మద్దతిచ్చింది..సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం మహాబోధి ఆలయం నదికి పశ్చిమాన ఉంది, సుజాత స్థూపం, ఇతర పురావస్తు అవశేషాలు నదికి తూర్పున ఉన్నాయి, నదికి తూర్పుగా ఉన్న అవవేశాలు ఇప్పుడు మహాబోధి ఆలయంలో స్వతంత్రమైనవిగా ఉన్నాయి. కానీ ఆలయం, సుజాత స్థూపం, ఇతర పురావస్తు అవశేషాలు రెండూ కూడా గతంలో ఒకే నది ఒడ్డున ఉన్నాయని తాజా అన్వేషణ చూపిస్తుందని పరిశోధకులు చెప్పారు. దీని ప్రకారం చూస్తే, స్మారక చిహ్నాలు, ఇతర పురావస్తు అవశేషాలు నదికి తూర్పున మహాబోధి కాంప్లెక్స్‌లో భాగంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు.

చైనీస్ బౌద్ధ సన్యాసి హుయెత్సాంగ్‌ని జువాన్ జాంగ్‌గా పిలుస్తారు. ఇతను హర్షవర్ధన రాజు పాలనతో భౌద్ధ గ్రంథాలను పొందేందుకు చైనా నుంచి భారత్‌కి వచ్చాడు. 629 నుంచి 645 CE వరకు భారతదేశంలో పర్యటించాడు. 657 భారతీయ గ్రంథాలను చైనాకు తీసుకురావడాని కృషి చేశాడు. ఇతని రచనల ద్వారా చైనాలో బౌద్ధం బలపడింది. 1860-1870లో అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ నలంద, వైశాలి వంటి ప్రదేశాలను గుర్తించేందుకు ఇతని యాత్రా, రచనలు ఉపయోగపడ్డాయి.