తమిళనాడు రాజకీయాల్లో శశికళ ఎప్పుడు చక్రం తిప్పుదామని ప్రయత్నాలు చేసినా.. ఆమెకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. జయలలిత నిచ్చెళిగా గుర్తింపు పొందిన ఆమె.. జయ కన్నుమూసిన తర్వాత.. అన్నా డీఎంకేలో కీలక బాధ్యతలు చేపట్టారు.. క్రమంగా సీఎం చైర్ ఎక్కాలని ప్రయత్నాలు చేసినా.. కేసుల్లో ఇరుక్కుపోయి జైలుపాలయ్యారు.. ఇక, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు జైలు నుంచి విడుదలైన ఆమెకు తమిళనాడులో భారీ స్వాగతమే లభించింది.. తన కారులో జయలలిత ఫొటో పెట్టుకుని దర్శనమిచ్చారు. ఎన్నికల ముందు ఏదో ప్రయత్నాలు చేసినట్టే కనిపించినా.. ఎన్నికల సమయంలో ఏమైపోయారు తెలియదు.. కానీ, ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపాలై.. డీఎంకే అధికారన్ని చేపట్టింది.. సీఎంగా దివంగత నేత స్టాలిన్ కుమారుడు పగ్గాలు చేపట్టారు.. ఆ తర్వాత మళ్లీ తెరపైకి వచ్చారు.
అన్నాడీఎంకేను తిరిగి గాడిలో పెట్టడానికి తాను వస్తున్నానంటూ శశికళ మాట్లాడినట్టు ఉన్న ఓ ఆడియో మళ్లీ కాకరేపింది. దీంతో.. మళ్లీ చిన్నమ్మ వస్తున్నారా..? పార్టీలో చిక్రం తిప్పుతారా? అనే చర్చ మొదలైంది.. కానీ, అన్నాడీఎంకే మాత్రం ఆమెకు షాకింగ్ న్యూస్ చెప్పింది.. శశికళ తిరిగి అన్నాడీఎంకేలోకి చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆ పార్టీ సీనియర్ నేత పొన్నియన్.. అసలు శశికళ అన్నాడీఎంకే సభ్యురాలే కాదని కుండబద్దలు కొట్టారు.. ఆమె టీవీవీ దినకరన్‌కు సంబంధించిన గ్రూప్ మనిషని వ్యాఖ్యానించిన ఆయన.. అన్నాడీఎంకేను తిరిగి గాడిలో పెతానని చెప్పే నైతిక హక్కు కూడా ఆమెకు లేదంటూ వాస్త ఘాటుగానే కౌంటర్ ఎటాక్ చేశారు. అసలు, శశికళ గురించి ఎవరైతే మాట్లాడుతారో, వారు అన్నాడీఎంకేకు సంబంధించిన వారే కాదని ప్రకటించారు.. దీంతో.. ఆడియో లీక్‌లు చేసి మళ్లీ పార్టీలో అడుగుపెడదామని చూస్తున్న శశికళను కట్టడిచేయడంపై అన్నాడీఎంకే ఫోకస్ పెట్టినట్టే కనిపిస్తోంది.