Site icon NTV Telugu

Santosh Yadav: ఆర్ఎస్ఎస్ దసరా వేడుకలకు తొలిసారిగా ఓ మహిళా అతిథి.. ఆమె ఎవరో తెలుసా..?

Santosh Yadav

Santosh Yadav

santosh yadav – The First Woman Chief Guest At RSS Dussehra Event: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్) తొలిసారిగా దసరా కార్యక్రమానికి ఓ మహిళను అతిథిగా ఆహ్వానించింది. గత 97 ఏళ్లలో ఓ మహిళను ముఖ్య అతిథిగా ఆహ్మానించడం ఇదే తొలసారి. నాగ్‌పూర్‌లో జరిగే వార్షిక దసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ప్రముఖ పర్వతారోహరాలు సంతోష్ యాదవ్ ను ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథి అని ఆర్ఎస్ఎస్ జాయింట్ పబ్లిసిటీ చీఫ్ నరేందర్ ఠాకూర్ తెలిపారు. అక్టోబర్ 5న నాగ్‌పూర్‌లోని రేష్మీబాగ్ మైదాన్‌లో దసరా కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ ఘనంగా నిర్వహించబోతోంది.

Read Also: Doctor Rice For Sugar Patients: షుగర్ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. డాక్టర్ రైస్

అసలెవరీ సంతోష్ యాదవ్..?
హర్యనా రేవారీ జిల్లా జోనియావాస్ గ్రామాని చెందిన సంతోష్ యాదవ్ (54) ప్రపంచంలో ఎతైన ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించిన మహిళగా గుర్తింపు పొందారు. 1992,1993లో రెండు సార్లు ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. తొలిసారి అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ ను అధిరోహించిన మహిళగా గుర్తింపు పొందారు. తూర్పున చైనా ముఖంగా ఉన్న కాంగ్‌షుంగ్ వైపు నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ కూడా సంతోష్ యాదవే. 14వ ఏటనే పెళ్లి చేయాలని భావించిన తరువాత రాజస్థాన్ జైపూర్ హస్టల్ లో ఉంటూ.. చదువును కొనసాగించింది. ఆ సమయంలో ఆరావళి పర్వతాన్ని చూసేది.. ఇదే ఆమెను పర్వతారోహకురాలని చేసింది.

1992లో కేవలం 20 ఏళ్లలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు సంతోష్ యాదవ్. అత్యంత కష్టతరమైన కాంగ్‌షుంగ్ పాస్ నుంచి పర్వతాన్ని అధిరోహించారు. ఆ తరువాత 1993లో ఇండో-నేపాల్ జట్టుతో మరోసారి ఎవరెస్టును ఎక్కారు. 1994లో నేషనల్ అడ్వెంచర్ అవార్డును అందుకున్నారు. 2000లో ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. హర్యానా ప్రభుత్వం 2006లో గురుగ్రామ్ లోని ఓ రోడ్డుకు ఆమె పేరును పెట్టింది.

ప్రతీ ఏడాది ఆర్ఎస్ఎస్ నాగ్ పూర్ కేంద్ర కార్యాలయంలో దసరా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. ప్రతీ ఏడాది వివిధ రంగాల్లో కృషి చేసిన పలువురిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుంటారు. ఈ ఏడాది సంతోష్ యాదవ్ ని ఆహ్మానించారు. గతంలో నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది ఆర్ఎస్ఎస్.

 

Exit mobile version