NTV Telugu Site icon

Sanjauli mosque row: సంజౌలి మసీదు వివాదం.. నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు

Simla

Simla

Sanjauli mosque row: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండిలోని సంజౌలి మసీదు అక్ర నిర్మాణంపై వివాదం కొనసాగుతుంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టడానికి వాటర్ క్యానన్లను ఉపయోగించడంతో మసీదుకు సమీపంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక, సంజౌలి మసీదుకు సంబంధించి ఇటీవల స్థానిక నివాసితులు, హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Read Also: Poonam Kaur: ఓనమ్‌ వెలుగులు.. పూనమ్ కౌర్ సొగసులు!

కాగా, సంజౌలి ప్రాంతంలోని మసీదు యొక్క అక్రమ భాగాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ సిమ్లాలో భారీ నిరసనలు చెలరేగాయి. ఆందోళన సమయంలో నిరసనకారులు భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా బారికేడ్లను బద్దలు కొట్టడంతో పాటు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. దీంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ ఫిరంగులు, లాఠీచార్జ్ చేశారు. వీరితో పాటు హిందూ జాగరణ్ మంచ్ కార్యదర్శి కమల్ గౌతమ్‌తో సహా కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఈ ఘటనపై మండి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సాక్షి వర్మ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని సంస్థలు ఇక్కడ నిరసనకు దిగాయని మాకు సమాచారం అందింది.. దానిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు.. శాంతిభద్రతలను కాపాడడమే మా లక్ష్యం అని చెప్పుకొచ్చారు. పరిస్థితిని అదుపు చేసేందుకు 300 మంది పోలీసులను నియమించాం.. సాధారణ తనిఖీల కోసం పట్టణ ప్రవేశ ద్వారం దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశామని ఎస్పీ సాక్ష వర్మ వెల్లడించారు.

Show comments