Sandip Ghosh: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే ఈ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి చిట్టా మొత్తం బయటపడటం తీవ్ర దుమారం రేపుతుంది. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో ఇప్పటికే సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. తాజాగా కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అప్పగించింది.
Read Also: Kishan Reddy: విపత్తుగా ప్రకటించడం కాదు.. నిధులు ఇస్తున్నామా లేదా?
ఇక, ఆర్‌జీ కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన దర్యాప్తులో సీబీఐ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సోమవారం రాత్రి అరెస్టు చేసింది. ఆసుపత్రి ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలకు సంబంధించి ఆయన్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఘోష్‌తో పాటు మరో ముగ్గురిని ఈరోజు అలీపూర్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఘోష్ ను 8 రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇచ్చింది కోర్టు.
అయితే, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌పై ఐపీసీలోని సెక్షన్ 120B (నేరపూరిత కుట్ర), సెక్షన్ 420 IPC (మోసం మరియు నిజాయితీ లేనితనం), అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 7 (2018లో సవరించబడింది)తో పాటు సెక్షన్ 120B కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. కోల్ కత్తా హైకోర్టు ఆదేశాల మేరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నుంచి కేసును సీబీఐ హ్యాండోవర్ చేసిన తర్వాత ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆర్‌జీ కర్ హాస్పిటల్ మాజీ డీప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ కాలేజీలోజరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ చేత దర్యాప్తు చేయవలసిందిగా అభ్యర్థించారు. ఆర్‌జీ కర్ హాస్పిటల్ లో జరిగిన అవినీతితో పాటు మరో జూనియర్ డాక్టర్ మరణానికి ఏ విధంగానైనా సంబంధం ఉందా అనే యాంగిల్ లో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.