NTV Telugu Site icon

Biggest Santa Claus 2023: ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లిపాయల శాంతాక్లాజ్‌..

Santa Claus

Santa Claus

Biggest Santa Claus 2023:  క్రిస్మస్ పేరు వినగానే బహుమతులు, కేక్, శాంతాక్లాజ్ గుర్తొస్తారు. ఈ పండుగలో ముఖ్యంగా క్రిస్మస్ తాతకు ప్రాముఖ్యత ఎక్కువ. ఎందుకంటే సీక్రెట్‌గా బహుమతులు, స్వీట్స్, చాక్లెట్స్ ఇచ్చేది ఈ క్రిస్మస్ తాతే. అందుకే క్రిస్మస్ సందర్భంగా ఇతరులకు సాయం చేయాలనుకునేవారు శాంతాక్లాజ్ అవతారం ఎత్తుతారు. సీక్రెట్‌గా బహుమతులు ఇచ్చి హెల్ప్ చేస్తుంటారు.

క్రిస్మస్ పండుగలో అంతటి ప్రాముఖ్యత ఉన్న క్రిస్మస్ తాతను ఉల్లి, ఇసుకతో ప్రదర్శించాడు ఓ ప్రఖ్యాత శిల్పి. క్రిస్మస్ సందర్భంగా శాంతాక్లాజ్‌తో ద్వారా ప్రజలకు తనదైన శైలిలో సందేశం ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి అయిన సుదర్శన్ పట్నాయక్.. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంతా క్లాజ్‌ను రూపొందించారు. ఉల్లిపాయలు, ఇసుక సహాయంతో సుదర్శన్ పట్నాయక్ ఈ శాంతా క్లాజ్‌ని తీర్చిదిద్దారు.

ఈ శిల్పం ముందు క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాయడంతో పాటు ఈ పండుగకు చెట్లను బహుమతిగా ఇచ్చి భూమిని సస్యశ్యామలం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. కాగా ఈ శాంతాక్లాజ్ సైకత శిల్పం 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు.ఈ సైకత శిల్పం తయారు చేసేందుకు ఎనిమిది గంటల సమయం పట్టిందని పట్నాయక్ తెలిపారు. కాగా వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియా ఈసైకత శిల్పాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంగా ప్రకటించింది.