క్రికెట్ దిగ్గజం, భారతరత్న పురస్కార గ్రహీత సచిన్ టెండుల్కర్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుసుకున్నారు. ముంబై పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. శుక్రవారం ఉదయం రాజ్ భవన్‌లో సచిన్‌తో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ట్విట్టర్ పేజీలో ప్రకటించింది. పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. అయితే ఇది మర్యాదపూర్వక భేటీనే అని తెలుస్తోంది. కాగా రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 25తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీకాలం మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. మరోవైపు ఇటీవల అండర్-19 భారతజట్టుకు ‘మీకు వంద కోట్ల మందికిపైగా మద్దతు బలం ఉంది. మంచిగా ఆడి, మెరుగైన ఫలితాలు సాధించాలి’ అంటూ సచిన్ పిలుపు ఇవ్వడం తెలిసిందే.
Sachin: రాష్ట్రపతిని కలిసిన సచిన్ టెండూల్కర్
