Sabarimala: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త..
- శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- భక్తుల కోసం దర్శన సమయాలు పెంపు..
- దర్శన సమయాలు రీ షెడ్యూల్ చేసిన దేవస్వం బోర్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాబోయే మండలం మకరవిళక్కు సీజన్ కోసం శబరిమల ఆలయ దర్శన సమయాలను రీషెడ్యూల్ చేసింది. భక్తుల కోసం దర్శన సమయాన్ని పెంచింది. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శన సమయం ఉంటుంది. భక్తుల దర్శనానికి 17 గంటల సమయం ఇచ్చింది. ప్రధాన పూజారితో సంప్రదింపులు జరిపిన తర్వాత దర్శన సమయంపై నిర్ణయం తీసుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.
Read Also: Appudo Ippudo Eppudo: ఆసక్తికరంగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్
Also Read
“తాంత్రి (ప్రధాన పూజారి) ఈ విషయంలో చాలా సహకారాన్ని అందించారు. ఈసారి శబరిమలలో వర్చువల్ క్యూ వ్యవస్థ మాత్రమే అమలులో ఉంది, అయితే ప్రతి భక్తుడికి దర్శనానికి అవకాశం కల్పిస్తాం. అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటాం’’ అని ప్రశాంత్ తెలిపారు. స్పాట్ బుకింగ్స్‌ని తొలగించి వర్చువల్ క్యూను మాత్రమే అనుమతించాలనే నిర్ణయంపై అనేక ఆందోళనలు తలెత్తున్నాయని ఆయన అన్నారు.
గతేడాది తీర్థయాత్ర సమయంలో విపరీతమైన రద్దీని చూశామని, దీంతో పోలీసులు వారిని అడ్డుకోవాల్సి వచ్చిందని, ఆ రోజుల్లో 20,000 కంటే ఎక్కువ స్పాట్ బుకింగ్స్ ఉన్నాయని చెప్పారు. మాకు భక్తుల సంఖ్య ముఖ్యం కాదని, భక్తుల భద్రతే ముఖ్యమని చెప్పారు. ఈ ఏడాది శబరిమల దర్శనానికి కేరళ ప్రభుత్వ ఆన్లైన్ బుకింగ్స్ విధానాన్ని తీసుకువచ్చింది. దీనిపై పినరయి విజయన్ ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
తాజావార్తలు
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
-
No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!