NTV Telugu Site icon

S Jaishankar: రష్యా ఆయిల్స్ కొంటామన్న జైశంకర్.. యూఎస్ విదేశాంగమంత్రి రియాక్షన్ చూడాలి.. వైరల్ వీడియో..

Jai Shankar

Jai Shankar

S Jaishankar: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అయితే, భారత్ మాత్రం రష్యా నుంచి ముడి చమురు కొంటూనే ఉంది. పలు సందర్భాల్లో యూరప్, అమెరికా నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ భారత్ ముడిచమురు కొనడం ఆపలేదు. పలు సందర్భాల్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెస్ట్రన్ మీడియాకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. తాజాగా ఆయన మరోసారి అమెరికా ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఔరా అనిపించారు.

పాశ్యత్య ఆంక్షల నేపథ్యంలో రష్యా చమురును కొనుగోలు చేయాలనే భారతదేశ నిర్ణయాన్ని జైశంకర్ గట్టిగా సమర్థించారు. శనివారం మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో జరిగిన ప్యానెల్ చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా, రష్యాల మధ్య భారత్ ఎలా వాణిజ్యంలో బ్యాలెన్సింగ్ కొనసాగిస్తుందని జైశంకర్‌ని అడగగా.. ‘‘ ఇది సమస్యనా..? నాకు మల్టీపుల్ ఎంపికలు ఉండేంత తెలివిగా ఉంటే, అది ఎలా సమస్య అవుతుంది..? మీరు నన్ను మెచ్చుకోవాలి’’ అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.

Read Also: JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం పొడగింపు..

అయితే, జైశంకర్ ఈ వ్యాఖ్యల్ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ముందే అన్నారు. ఆయన వ్యాఖ్యలతో బ్లింకెన్‌తో పాటు జర్మన్ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్ చిరునవ్వులు నవ్వారు. నేడు ప్రపంచంలో ఏ దేశమైన ఒకే తరహా సంబంధాలు కొనసాగించాలని ఆశించడం అవాస్తమని జైశంకర్ అన్నారు. భారత్ ‘నాన్-వెస్ట్’ అని, కానీ మేము వెస్ట్రన్ దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నామని ఆయన చెప్పారు.

గతంలో కూడా భారత్‌ని ఇరకాటం పెట్టే విధంగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై వెస్ట్రన్ మీడియా జైశంకర్‌ని ప్రశ్నించింది. అయితే, పలు సందర్భాల్లో వెస్ట్రన్ మీడియా చెంపదెబ్బ కొట్టేంత స్పష్టతతో సమాధానం ఇచ్చారు. ‘‘ భారత్ కొనుగోళ్లను యూరప్ కొనుగోళ్లలో పోలుస్తూ.. భారత్ నెలవారీ కొనుగోలుతో పోలిస్తే యూరప్ ఒక్క మధ్యాహ్నం వరకు కొనుగోలు చేసే దాని కన్నా తక్కువగా ఉంటుందని’’ ఆన్సర్ ఇచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో దౌత్యం, చర్చలు పరిష్కారమని, హింసను నిలిపేయాలని భారత్ తన వైఖరిని స్పష్టం చేసిందని జైశంకర్ పేర్కొన్నారు.