S Jaishankar: భారత మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్‌నాథ్ జ్ఞాపకాలతో రెడీ చేసిన ‘ఫియర్‌లెస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ లాగానే భారత విదేశాంగ విధానం కూడా ఉందన్నారు. పాక్ విషయంలో మారిన భారత వైఖరిని క్రికెట్‌తో పోల్చారు. ఇక, పాకిస్థాన్, శ్రీలంక ఓ దశలో ప్రపంచ కప్పును గెలిచాయి. కానీ, ఇండియన్ క్రికెట్‌కు 1983 ఓ కీలక మలుపు అని చెప్పాలి.. ఎందుకంటే ఆ ఏడాది తర్వాత భారత క్రికెట్ పూర్తిగా మారిపోయిందో మీరు చూస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, క్రికెట్‌లో వచ్చే మార్పులతో మన విదేశాంగ విదానాన్ని పోల్చడానికి నేను ఎప్పుడూ ఇష్టపడతానని పేర్కొన్నారు. చాలా మంది ఫారిన్ పాలసీని చదరంగంతో పోల్చుతారని జైశంకర్ వెల్లడించారు.
Read Also: Prabath Jayasuriya: 17 మ్యాచ్‌లలో 100 వికెట్స్.. చరిత్ర సృష్టించిన జయసూర్య!
ఇక, ప్రపంచ దేశాలు భారత్‌తో ఎలాంటి డీల్ చేయాలనుకుంటోందో అలాంటి భారత్ ఇప్పుడుందని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ప్రపంచ వ్యవహారాల్లో భారత్ యొక్క ప్రమాణాలను నెలకొల్పుతోంది.. ఇతరుల శక్తిసామర్థ్యాలను తాము పరీక్షిస్తున్నామన్నారు. పాకిస్థాన్‌లో మన జట్టు 1982-83లో పర్యటించినప్పుడు.. అక్కడ మనవాళ్లు మెరుగ్గా ఆట ఆడారు.. ఎందుకంటే సంప్రదాయ ఆట తీరు నుంచి బయటకొచ్చి.. దూకుడును ప్రదర్శించారు.. పాక్‌తో విదేశాంగ విధానంలో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ దొరకదని జైశంకర్ పేర్కొన్నారు. కాగా, లాలా అమర్‌నాథ్ కుమారుడు మొహిందర్ అమర్‌నాథ్ 1969-89 మధ్యలో భారత జట్టుకు ప్రతినిథ్యం వహించారు. టెస్టుల్లో 4,378 పరుగులు చేయగా.. అందులో మొత్తం 9 శతకాల్లో 7 విదేశీ గడ్డపైనే బాదాడు. 1983 వన్డే ప్రపంచకప్ సెమీస్, ఫైనల్స్‌లో మొహిందర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.