NTV Telugu Site icon

S Jaishankar: “బ్యాడ్ హ్యాబిట్”.. రాహుల్ విషయంలో వెస్ట్రన్ దేశాలకు క్లాస్..

S Jaishankar

S Jaishankar

S Jaishankar:పాశ్యాత్య దేశాలకు మరోసారి తలంటారు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు విషయంలో, ఉక్రెయిన్ యుద్ధ విషయంలో వెస్ట్రన్ దేశాలు భారత వైఖరిని తప్పుబడుతున్న సమయంలో వారికి సరైన పాఠం నేర్పారు జైశంకర్. ఇదిలా ఉంటే మరోసారి పాశ్చాత్య దేశాల వైఖరిని తప్పుబట్టారు. రాహుల్ గాంధీ విషయంలో పలు విదేశాలు స్పందించడంపై ‘‘ బ్యాడ్ హ్యాబిట్’’ అంటూ ఘాటుగా స్పందించారు.

Read Also: Pre Wedding Shoot Viral : పెళ్లిలో ప్రైవేట్ వీడియో.. సిగ్గుతో కళ్లు మూసుకున్న వరుడు

ఇతర దేశాల అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడం పశ్చిమ దేశాలకు అలవాటని జైశంకర్ విమర్శించారు. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో వ్యాఖ్యానించే హక్కు తమకు దేవుడు ఇచ్చిన హక్కు అని వెస్ట్రన్ కంట్రీస్ భావిస్తున్నాయని ఆయన ఆదివారం అన్నారు. బెంగళూర్ లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికా, జర్మనీ, యూకేలు రాహుల్ గాంధీ జైలు శిక్ష, అనర్హత విషయాల్లో స్పందిస్తూ.. మేము రాహుల్ గాంధీ విషయాన్ని గమనిస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశాయి. దీనిపై ఓ ప్రశ్నకు బదులిస్తూ వెస్ట్రన్ దేశాల వైఖరిని తూర్పారపట్టారు.

ఇతర దేశాలపై వ్యాఖ్యానించే బ్యాడ్ హ్యాబిట్ వెస్ట్రన్ దేశాలకు ఉందని ఆయన అన్నారు. వారు దీనిని దేవుడు ఇచ్చిన హక్కుగా భావిస్తున్నారని.. వారు ఇలాగే చేస్తూ ఉంటే ఇతరులు కూడా వారిపై వ్యాఖ్యానిస్తారని అన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మీరే మీపై మాట్లాడాలని ఇతరును కోరుతున్నారని, మేము సమస్యల్లో ఉన్నామని ప్రపంచానికి ఆహ్వానాలు ఇవ్వడం మానేయాలని సూచించారు.
రాజకీయ ఉచితాలపై కూడా జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాల ఆధారంగా దేశాన్ని నడపలేరని ఆయన అన్నారు. ఉచితాలతో త్వరగా ప్రజాధరణ పొందుతున్నారని.. ఇది బాధ్యతారాహిత్యమైన మార్గంగా ఆయన అభిర్ణించారు.