Site icon NTV Telugu

సెప్టెంబ‌ర్ నుంచి భార‌త్‌లో ర‌ష్యా వ్యాక్సిన్ ఉత్ప‌త్తి…

దేశంలో వ్యాక్సిన్ ను వేగంగా అందిస్తున్నారు.  ఇప్ప‌టికే దాదాపుగా 50 కోట్ల వ‌ర‌కు వ్యాక్సిన్ అందించారు.  అయితే, మొద‌టి డోసులు వేగంగా వేస్తున్నా సెకండ్ డోస్ కోసం ఎదురుచూసేవారి సంఖ్య అధికంగా ఉన్న‌ది.  ఇక ఇదిలా ఉంటే, కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌తో పాటు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి.  స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌లు కేవ‌లం ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి.  ప్ర‌స్తుతం వీటిని రష్యానుంచి దిగుమ‌తి చేసుకోవ‌డంతో కేవ‌లం ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్ర‌మే అందిస్తున్నారు.  

Read: నగరి బరిలో నారాయణ..? ఆయనే క్లారిటీ ఇచ్చారు..

అయితే, వచ్చే సెప్టెంబ‌ర్ నుంచి ఈ వ్యాక్సిన్ భార‌త్‌లో త‌యారు చేసేందుకు అన్ని ర‌కాల ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు ర‌ష్య‌న్ డెరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ వెల్ల‌డించింది.  సీరం ఇనిస్టిట్యూట్‌, గ్లాండ్ ఫార్మా, హెటెరో బ‌యోఫార్మా, ప‌నేషియా బ‌యోటెక్‌, స్టెలిస్ బ‌యోఫార్మా, విర్కౌ బ‌యోటెక్‌తో పాటుగా మోర్పెన్ ల్యాబ్‌లు కూడా స్పుత్నిక్ త‌యారీకి స‌న్నాహాలు చేస్తున్నాయ‌ని ఆర్‌డీఐఎఫ్ వెల్ల‌డించింది.  సెప్టెంబ‌ర్ నుంచి భార‌త్ కేంద్రంగా వ్యాక్సిన్ త‌యారీ ఉంటుంద‌ని ఆర్‌డీఐఎఫ్ పేర్కొన్న‌ది.  

Exit mobile version