2024 Elections: 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం కోసం అధికార, ప్రతిపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యా్ట్రిక్ సాధించాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఈ సారి ఎలాగైనా గెలిచి తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే అటు బీజేపీకి గానీ.. ఇటు కాంగ్రెస్ గానీ సొంతంగా కాకుండా.. కూటముల రూపంలోనే ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలో ఎన్‌డీఏ కూటమిగా మూడోసారి ముందుకెళుతుండగా.. గతంలో యూపీఏకి నాయకత్వం వహించిన కాంగ్రెస్ తన పాత మిత్రులను కలుపుకోవడమే కాకుండా కొత్త వారితోనూ ముందుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలతో సమావేశాలను నిర్వహించడం మొదలు పెట్టింది. ఇప్పటికే ఒక మీటింగ్‌ను పూర్తిచేసి ఇపుడు రెండో మీటింగ్‌ను ఈ రోజు బెంగళూరులో నిర్వహించనుంది. ఈ సమావేశాన్ని ఈ రోజుతోపాటు రేపు కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించడం కోసం ఎన్‌డీఏ ప్రయత్నాలు ప్రారంభించింది. రేపు ఎన్‌డీఏ పక్షాల మొదటి సమావేశంను నిర్వహించనున్నారు.
Read also: IND vs WI: వెస్టిండీస్‌కు అజిత్ అగర్కార్.. ఎవరి కోసం?
లోక్‌సభ ఎన్నికలు మరో పది నెలల్లో జరుగనుండగా.. పాలక, ప్రతిపక్షాలు మిత్రులను కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. పోటాపోటీగా సోమ, మంగళవారాల్లో సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఎన్‌డీఏ వైపు 36 పార్టీలు ఉండగా.. బెంగళూరులో జరిగే విపక్షాల సమావేశానికి 24 పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఐక్యతా యత్నాల జోరును కాంగ్రెస్ పెంచింది. ఇతర విపక్షాలకు దీటుగా కమలనాథులు కూడా మిత్రపక్షాలను చేరదీస్తున్నారు. ఎన్‌డీఏలో ప్రస్తుత 30 పార్టీలు కొనసాగుతున్నాయి. వాటిలో బీజేపీ, అన్నాడీఎంకే, శివసేన (షిండే), నేషనల్ పీపుల్స్‌పార్టీ, ఎన్‌డీపీపీ, సిక్కిం క్రాంతి మోర్చా, జేజేపీ, ఐఎంకేఎంకే, ఏజేఎస్‌యూ, ఆర్‌పీఐ, మిజో నేషనల్ ఫ్రంట్, బోడో పీపుల్స్ ఫ్రంట్, తమిళ మానిల కాంగ్రెస్, ఐపీఎఫ్‌టీ, పీఎంకే, ఎంజీపీ, అప్నాదళ్, ఏజీపీ, రాష్ట్రీయ లోక్‌జనశక్తి పార్టీ, నిషాద్ పార్టీ, యూపీపీఎల్, ఏఐఆర్‌ఎన్‌సీ, శిరోమణి అకాలీదళ్ సంయుక్త్ (థిండ్సా), జనసేన, ప్రహార్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ సమాజ్ పక్ష, జన్ సురైవ శక్తి, కుకీ పీపుల్స్ అలయెన్స్, యూడీపీ, హెచ్‌ఎస్‌పీడీపీ పార్టీలు కొనసాగుతున్నాయి. అవి కాకుండా.. కొత్తగా మరో 6 పార్టీలు చేరనున్నాయి. వాటిలో ఎన్‌సీపీ (అజిత్), ఎల్‌జేపీ (రాంవిలాస్), హిందూస్థాన్ ఆవామ్ మోర్చా (హెచ్‌ఏఎం), ఆర్‌ఎల్‌ఎ్‌సపీ, వికాస్‌సీల్ ఇన్‌సాన్ పార్టీ, ఎస్‌బీఎస్‌పీ.
Read also: Woman Loots 27 Men: ఒక మహిళ.. 27 మంది భర్తలు.. కథలో పెద్ద ట్విస్ట్
గత నెల జూన్ 23న పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశానికి మొత్తం 15 పార్టీలు హాజరయ్యాయి. వాటిలో కాంగ్రెస్, టీఎంసీ, ఎన్‌సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సీపీఎం, సీపీఐ, జేడీయూ, ఆర్‌జేడీ, డీఎంకే, సమాజ్‌వాదీ, శివసేన (ఉద్ధవ్), జేఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ (ఎంఎల్) పార్టీలు ఉన్నాయి. ఇవి కాకుండా కొత్తగా మరో 9 పార్టీలు చేరబోతున్నాయి. కొత్తగా చేరబోయే పార్టీలు వీసీకే, ఫార్వర్డ్ బ్లాక్, ఎండీఎంకే, కేడీఎంకే, ఆర్‌ఎ్‌సపీ, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి), ఆర్‌ఎల్‌డీ ఉన్నాయి.
