Site icon NTV Telugu

Mohan Bhagwat: ‘‘ ఔరంగజేబు వారసులుగా భావించే వారికి ప్రవేశం లేదు’’ ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

Mohan Bhagwat

Mohan Bhagwat

Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ సంస్థలోకి ప్రవేశం గురించి మాట్లాడుతూ.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారసులుగా భావించే వారికి తప్ప, సంస్థలోకి అందరికి తలుపులు తెరిచి ఉన్నాయని అన్నారు. మతం, కులం, వర్గం వంటి వాటిని బట్టి ఆరాధన పద్ధతులు మారుతుంటాయి, కానీ సంస్కృతి ఒక్కటే అని, భారతీయులందరికి సంఘ్‌లోకి స్వాగతం అని అన్నారు. వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒక స్వచ్ఛంద సేవకుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

Read Also: Prasanna Sankar-Dhivya: “బలవంతంగా సె*క్స్ , ఫ్రెండ్స్‌తో పడుకోమన్నాడు”.. రిప్లింగ్ దంపతుల కేసులో ట్విస్ట్.

ముస్లింలను శాఖలోకి తీసుకుంటారా..? అని ప్రశ్నించిన సమయంలో, దానికి సమాధానంగా భగవత్ మాట్లాడుతూ.. భారత్ మాతాకీ జై అని చెప్పే, కాషాయ జెండాను గౌరవంగా చూసే వారిందరు ఆర్ఎస్ఎస్‌లోకి రావచ్చని అన్నారు. ఆరాధించే పద్ధతి ఆధారంగా సంఘ్ భావజాలం ఎలాంటి వివక్ష చూపించదని ఆయన అన్నారు.

Exit mobile version