NTV Telugu Site icon

Mumbai Airport: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.1.49 కోట్ల వజ్రాలు సీజ్.. ఒకరి అరెస్టు

Mumbai

Mumbai

Mumbai Airport: బంగారానికి, వజ్రాలకు చాలా విలువ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే కేటుగాళ్లు ఒక దేశం నుంచి మరో దేశానికి తరలించి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. విదేశాల నుంచి భారత దేశానికి తీసుకువచ్చి అమ్ముకోవడం లేదా.. ఇండియా నుంచి తీసుకెళ్లి విదేశాల్లో అమ్ముకోవడం ఏదో ఒకటి చేస్తుంటారు. ఇలా చేస్తున్న కేటుగాళ్లల్లో కొందరు విమానాశ్రయాల్లో అధికారులకు పట్టుబడుతుంటారు. అలాంటి ఘటనే దేశ ఆర్థిక రాజధాని ముంబయి విమానాశ్రయంలో జరిగింది. ముంబయి విమానాశ్రయంలో భారీగా వజ్రాలను పట్టుకున్నారు. రూ. 1.49 కోట్ల విలువ చేసే వజ్రాలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. వజ్రాలను విదేశాలకు తరలించడానికి ప్రయత్నించి ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వజ్రాలను డీ ఫౌడర్‌లో కలిపి తరలించేందుకు ప్రయత్నించి నిందితుడు. వజ్రాలతో దుబాయ్‌కి వెళుతున్న ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు.

Read also: Snake Farming: ఆ ఊర్లో పాములే అట్రాక్షన్.. కోట్లు సంపాదిస్తూ కోటలు కట్టేస్తున్నారు

ముంబయి విమానాశ్రయం నుంచి దుబాయ్‌ వెళుతున్న ఒక భారతీయుడిని అరెస్టు చేసి .. అతని వద్ద నుంచి రూ. 1.49 కోట్ల విలువైన 1559.6 క్యారెట్ల సహజసిద్ధమైన వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. వజ్రాలను విదేశాలకు తరలించే ప్రయత్నం చేసిన నిందితుడిని బుధవారం అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వజ్రాలను టీ ప్యాకెట్‌లో చాకచక్యంగా దాచి ఉంచారని కస్టమ్స్ అధికారులు తెలిపారు.ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అంతకుముందు కొచ్చిన్ కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం వెనుక టాయిలెట్ నుండి సుమారు రూ. 85 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్లెయిమ్ చేయని రెండు బ్యాగుల్లో బంగారం పేస్ట్ రూపంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం బరువు 1,709 గ్రాములు ఉంటుందని అధికారులు తెలిపారు. “ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది నుండి అందిన సమాచారం ఆధారంగా, AUH నుండి విమానం 6E 1404 వెనుక టాయిలెట్ నుండి రెండు క్లెయిమ్ చేయని బ్యాగుల్లో బంగారాన్ని పేస్ట్ రూపంలో స్వాధీనం చేసుకున్నట్టు కొచ్చిన్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. రికవరీకి సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు.