Mammootty-Mohanlal: మలయాళం సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ వివాదం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మోహన్‌లాల్ మమ్ముట్టి తరుపున శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో పూజ చేయించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ముస్లిం అయిన మమ్ముట్టి (అసలు పేరు మహ్మద్ కుట్టి) పేరుతో ఎలా పూజ చేయిస్తారని ఆయన వర్గానికి చెందిన కొందరు విమర్శిస్తున్నారు. మమ్ముట్టి పేరులో పూజ నిర్వహించిన రసీదు బయటకు రావడంతో ఒక్కసారి ఇది కేరళలో వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన రసీదు వైరల్‌గా మారింది.
మోహన్ లాల్ కొత్త సినిమా ‘‘L2: ఎంపురాన్’’ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వివాదంపై మోహన్ లాల్ స్పందించారు. మమ్ముట్టి తనకు సోదరుడిలాంటి వాడని, అతడి కోసం ప్రార్థించడంలో తప్పేంటి..? అని ప్రశ్నించారు. అతను ఇప్పుడు బాగానే ఉన్నాడని, అతడికి చిన్న ఆరోగ్య సమస్య ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తన స్నేహితుడి కోసం ప్రార్థించడం తన వ్యక్తిగత విషయమని, దేవస్వం బోర్డు నుంచి ఎవరో పూజా నైవేద్యం రసీదును లీక్ చేసినట్లు చెప్పారు.
మార్చి 18న, మోహన్ లాల్ శబరిమల ఆలయానికి వెళ్లి ముమ్ముట్టికి పూజలు చేశారు. రసీదు వైరల్ అయిన వెంటనే, ఒక వర్గం ప్రజలు ముమ్ముట్టి ఇస్లామిక్ విశ్వాసాలను దెబ్బతీశారని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు, ఇన్‌ఫ్లూయెన్సర్ అబ్దులా మాట్లాడుతూ..మమ్ముట్టి కోసం మోహన్ లాల్ పూజలు చేయడాన్ని విమర్శించాడు. హిందూ ఆలయంలో ముస్లిం కోసం పూజలు చేసినందుకు మోహన్ లాల్ ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ ఆలయంలో ముస్లిం కోసం పూజలు చేసి తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాడని ఆరోపించాడు.
Read Also: Rahul Gandhi: లోక్‌సభ స్పీకర్‌పై రాహుల్‌గాంధీ గరం గరం
‘‘ ఇది మమ్ముట్టికి తెలియకుండా జరిగితే క్షమాపణలు చెప్పాని, అది మోహన్ లాల్ చెసిన తప్పు అని, అయ్యప్ప స్వామిపై మోహన్ లాల్‌కి చాలా విశ్వాసం ఉండొచ్చు, ఆ విశ్వాసం ఆధారంగా ఆయన పూజ చేసి ఉండొచ్చు. అయితే మమ్ముట్టి ఆదేశంతో నైవేద్యం సమర్పించి ఉంటే అది పెద్ద నేరం, ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం, ఎవరూ అల్లాకు తప్పతే మరెవరని ఆరాధించకూడదు’’ అని అబ్దుల్లా అన్నారు. మమ్ముట్టి వివరణ ఇవ్వాలని, ముస్లిం మత పండితులు జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.
మమ్ముట్టికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నాడనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే మమ్ముట్టి పేరు, ఆయన నక్షత్రమైన విశాఖ పేరుపై శబరిమలలో మోహన్ లాల్ పూజలు నిర్వహించారు. అయితే, దేవస్వం బోర్డులోని ఎవరో ఒకరు ఈ రసీదును లీక్ చేశారని మోహన్ లాల్ వ్యాఖ్యల్ని బోర్డు తప్పు పట్టింది. ఆయన ప్రకటన అపార్థానికి దారి తీసిందని, వారి అధికారుల తప్పు లేదని ట్రావెన్ కోర్ బోర్డు ఖండించింది. ఈ వివాదంపై పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ. వారిద్దరు స్నేహితులు , ఇలా చేయడం ఇదే తొలిసారి కాదని, ఈ సారి వార్తల్లోకి వచ్చిందని అన్నారు.