Site icon NTV Telugu

Romances on a Bike: బైక్‌పై రొమాన్స్ చేస్తూ ఎస్పీకి పట్టుబడ్డ జంట.. వీడియో వైరల్..

Romance On Bike

Romance On Bike

Romances on a Bike: ఇటీవల కాలంలో పలు జంటలు బైకుపై నడిరోడ్డు మీద రొమాన్స్ చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఇలాంటి అభస్యకరమైన పనుల్ని ప్రజలు చూస్తున్నారనే సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మరోసారి ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌లో ఇలాంటి ఘటనే ఎదురైంది. బైకుపై ఓ జంట రొమాన్స్ చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. కేటీఎం బైకు పెట్రోల్ ట్యాంక్‌పై అమ్మాయి ఎదురుగా కూర్చుని, యువకుడికి ముద్దులు ఇవ్వడం కెమెరాకు చిక్కింది. వీరిని ఎస్పీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు, రైడర్‌కి చలాన్ జారీ చేశారు.

Read Also: Prajwal Revanna: ప్రజ్వల్‌ కేసులో కర్ణాటక హోంమంత్రి కీలక సూచనలు

జష్‌పూర్ హైవేపై తన లవర్‌ని ఇంప్రెస్ చేసేందుకు వినయ్ అనే వ్యక్తి బైక్ స్టంట్స్ చేస్తున్నాడు. ఎస్పీ శశిమోహన్ సింగ్ తన కారులో నుంచి వీరిని గుర్తించి, వీడియో తీశారు. వినయ్ తన 18 ఏళ్ల ప్రియురాలు సుహానిని బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చోబెట్టుకుని స్టంట్స్ చేశాడు. ఎస్పీ కారును గమనించి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఎస్పీ శశిమోహన్ సింగ్ మాట్లాడుతూ.. కుంకూరి నుంచి జాష్‌పూర్‌కు వెళుతుండగా జంట ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నట్టు గుర్తించామని, వారిని ఆపి విచారించామని, మాయాలి డ్యామ్‌ను సందర్శించేందుకు వచ్చి ఈ స్టంట్స్ చేస్తున్నామని చెప్పారని, వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఇలాంటి స్టంట్స్ మానుకోవాలని, తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని ప్రజల్ని కోరారు. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Exit mobile version