Site icon NTV Telugu

Puran Kumar: ఐపీఎస్ పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య కేసులో ఎస్పీపై వేటు

Ips

Ips

హర్యానాలో మంగళవారం ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఈ కేసును అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోహ్‌తక్‌ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాపై అధికారులు వేటు వేశారు.

ఇది కూడా చదవండి: Jodhpur University: యూనివర్సిటీ నిర్వాకం.. 100కి 123 మార్కులు.. మెమో చూసుకుని విద్యార్థులు ఆశ్చర్యం

సూసైడ్‌లో మృతుడు పేర్కొన్న పేర్లు ప్రకారం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రోహ్‌తక్‌ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాపై వేటు వేసింది. హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్ సహా ఎనిమిది మంది సీనియర్ అధికారులపై సూసైడ్ నోట్‌లో కుల ఆధారిత వివక్ష, మానసిక వేధింపులు, బహిరంగ అవమానాలు, దౌర్జన్యాలపై సూసైడ్ నోట్‌లో మృతుడు ఆరోపించాడు.

ఇది కూడా చదవండి: Pakistan: పోలీస్ శిక్షణా కేంద్రంపై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు పోలీసులు.. ఏడుగురు ఉగ్రవాదులు మృతి

ఈ నేపథ్యంలో పూరన్‌ ఆత్మహత్యకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో హర్యానా డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్‌తో పాటు రోహ్‌తక్‌ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాల పేర్లను చేర్చాలంటూ మృతుడు భార్య, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి అమ్నీత్‌ కుమార్‌ డిమాండ్‌ చేసింది. ఈ క్రమంలోనే ఎస్పీని పదవి నుంచి తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ అమ్నీత్‌ కుమార్‌కు లేఖ రాశారు. ఐపీఎస్ అధికారి పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకోవడం తనను షాక్‌కు గురిచేసిందని.. ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయం కోసం మీరు చేస్తున్న పోరాటానికి కోట్లాది మంది భారతీయులు అండగా ఉన్నారంటూ భరోసా ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Pawan Singh: బీజేపీలో చేరిన గాయకుడు పవన్ సింగ్.. బీహార్‌లో పోటీ కోసమేనా?

Exit mobile version