NTV Telugu Site icon

Wayanad affidavit: ప్రియాంకాగాంధీ అఫిడవిట్‌తో రాబర్ట్ వాద్రాకు ఐటీ షాక్

Priyankagandhi

Priyankagandhi

కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ వయనాడ్‌లో దాఖలు చేసిన అఫిడవిట్‌తో భర్త రాబర్ట్ వాద్రాకు కొత్త చిక్కులొచ్చిపడ్డాయి. బుధవారం వయనాడ్ కలెక్టరేట్‌లో ప్రియాంక నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె అఫిడవిట్ సమర్పించారు. ఇందులో తనకు రూ.12 కోట్లు ఆస్తులు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. తన భర్త పేరు మీద రూ.66 కోట్లు ఉన్నట్లు ఆమె వెల్లడించారు. అంటే ప్రియాంక కంటే ఐదు రెట్ల ఎక్కువగా రాబర్ట్ వాద్రా ఆస్తులు కలిగి ఉన్నారు. దీంతో ఐటీ శాఖ అవాక్కైంది. 11 ఏళ్లుగా రాబర్ట్ వాద్రా దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌లకు వ్యతిరేకంగా ఈ ఆస్తులున్నాయి. దీంతో ఐటీ శాఖ అప్రమత్తమైంది. ఇప్పటి వరకు వాద్రా దంపతులు ఆస్తులు ప్రకటించలేదు. ఆస్తులు బహిర్గతం కావడం ఇదే తొలిసారి. ప్రియాంక నామినేషన్‌తో ఆస్తులు వివరాలు బయటకు వచ్చాయి. ప్రియాంక సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె భర్త రాబర్ట్ వాద్రా రూ.80 కోట్లు చెల్లించాలంటూ ఐటీ శాఖ ఝలక్ ఇచ్చింది. దశాబ్ద కాలంగా రాబర్ట్ వాద్రా తన నిజమైన ఆదాయాన్ని ప్రకటించలేదని ఐటీ శాఖ అనుమానం వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: AP CM Chandrababu: అమరావతికి రైల్వే లైన్‌.. ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కృతజ్ఞతలు

ప్రియాంకాగాంధీకి రూ. 12 కోట్ల ఆస్తులు, భర్త రూ. 66 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో అద్దె ఆదాయం, ఇతర పెట్టుబడులతో కలిపి మొత్తం రూ. 46.39 లక్షల ఆదాయాన్ని ప్రియాంక ప్రకటించింది. ఆస్తుల్లో రూ.4.25 కోట్ల చరాస్తులు ఉన్నాయి. వాటిలో మూడు బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్లు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, పీపీఎఫ్, రాబర్డ్ వాద్రా గిఫ్ట్‌గా ఇచ్చిన హోండా సీఆర్‌వీ కారు, రూ.1.15 కోట్లు విలువచేసే 4400 గ్రాములకు పైగా బంగారం ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Raja Saab: రికార్డుల్లోనూ ప్రభాస్ ‘రాజే’!

స్థిరాస్తుల విలువ రూ.7.74 కోట్లు. ఢిల్లీలోని మెహ్రౌలి ఏరియాలో రెండు అగ్రికల్చరల్ ల్యాండ్స్ (ఇన్‌హెరిటెడ్ హాఫ్-షేర్స్), ఫామ్‌హౌస్‌లో హాఫ్-షేర్ వంటివి ఉన్నాయి. సొంతంగా హిమాచల్ ప్రదేశ్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉంది. దీని విలువ రూ.5.63 కోట్లు. రూ.15.75 కోట్ల మేరకు రుణాలు కూడా ఉన్నాయి. అదనంగా ఆమెపై రెండు ఎఫ్ఐఆర్‌లు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన ఒక నోటీసు ఉన్నట్టు ఆ అఫిడవిట్‌లో ప్రియాంక తెలిపారు. ప్రియాంక భర్త, వ్యాపారవేత్త రాబర్డ్ వాద్రాకి రూ.37.9 కోట్లు విలువచేసే చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ప్రియాంక తన భర్త బహుమతిగా ఇచ్చిన రూ.8 లక్షల విలువైన హోండా సీఆర్‌వీ కారు కూడా ఉందని తెలిపారు. ప్రియాంక గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం వాద్రాకు దాదాపు 10 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి.