NTV Telugu Site icon

చోరీకి వ‌చ్చి… ఏటీఎం లో ఇలా ఇరుక్కుపోయాడు…

చోరుల్లో ప‌లు ర‌కాలు ఉంటారు.  కొంత‌మంది ఇళ్ల‌కు క‌న్నాలు వేస్తే మ‌రికొంద‌రు బ్యాంకుల‌కు క‌న్నం వేస్తారు.  అయితే కొంద‌రు మాత్రం ఏకంగా ఏటీఎం ల‌కు క‌న్నం వేస్తుంటారు.  ఇలానే ఓ చోరుడు ఏటీఎంకు క‌న్నం వేశాడు.  అయితే, ఏటీఎం మిష‌న్ బ‌ద్ద‌లు కొట్ట‌గానే అలారం మోగింది.  దీంతో భ‌య‌ప‌డిన ఆ చోరుడు ఏటీయం మిషిన్‌లో దాక్కునేందుకు ప్ర‌య‌త్నం చేశాడు.  కానీ, మిషిన్ లోప‌ల స్థ‌లం చిన్న‌దిగా ఉండ‌టంతో బ‌య‌ట‌కు రాలేక‌పోయాడు.  ప‌దేప‌దే మిష‌న్ అలారం మోగ‌డంతో పోలీసులు ఏటీఎం మిష‌న్ వ‌ద్ద‌కు చేరుకొని ఆ దొంగ‌ను అదుపులోకి తీసుకున్నారు.  ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులోని అనియాపురంలో జ‌రిగింది. స్థానిక కోళ్లఫారంలో ప‌నిచేస్తూ అవ‌స‌రాల కోసం దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నాడు ఈ బీహార్ చోరుడు.  

Read: బధిరుల భాషకు గుర్తింపు… బాలీవుడ్ స్టార్ హర్షం!