Site icon NTV Telugu

మ‌హారాష్ట్ర‌లో ఘోర‌రోడ్డు ప్ర‌మాదం: 13 మంది మృతి…

మ‌హారాష్ట్ర‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.  బుల్గానాలోని స‌మృద్ధి ఎక్స్‌ప్రెస్ వే పై ఐర‌న్‌లోడ్ తో వెళ్తున్న‌లారీ బోల్తా ప‌డింది.  ఆ ఘ‌ట‌న‌లో 13 మంది మృతిచెందారు.  మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి.  టిప్ప‌ర్ లారీపై 16 మంది కూలీలు ఐర‌ల్‌లోడ్‌పై కూర్చోని ప్ర‌యాణం చేస్తున్నారు.  స‌డ‌న్‌గా ఎక్స్‌ప్రెస్ వే పై అదుపుత‌ప్ప‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘ‌ట‌నా స్థలానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేపట్టారు.  రోడ్డుపై మృత‌దేహాలు చెల్లాచెదురుగా ప‌డిపోవ‌డంతో ఆ ప్రాంతం మొత్తం హృద‌య‌విదార‌కంగా మారిపోయింది.  

Read: ఆ శ‌క్తుల ఉనికి శాశ్వ‌తం కాదు… ప్ర‌ధాని మోడీ…

Exit mobile version