Site icon NTV Telugu

Lalu Prasad Yadav: దాణా కుంభకోణంలో లాలూకు షాక్.. ఐదేళ్ల జైలుశిక్ష

దాణా కుంభకోణం కేసులో బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. దాణా కుంభకోణానికి సంబంధించిన డోరండా ట్రెజరీ కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాదు రూ. 60 లక్షల ఫీజు కూడా చెల్లించాలని రాంచీలోని సీబీఐ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.

దాణా కుంభకోణానికి సంబంధించిన డోరండా ట్రెజరీ కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా పేర్కొంటూ గత వారం సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. జార్ఖండ్‌‌లోని డోరాండా ట్రెజరీ నుంచి రూ.139.35 కోట్లను అక్రమంగా విత్‌డ్రా చేయడంపై లాలూ ప్రసాద్ యాదవ్‌పై కేసు నమోదైంది. ఆయన బీహార్ సీఎంగా ఉన్న సమయంలో పశువులకు మేత, ఇతర అవసరాల కోసం కల్పిత ఖర్చులు సృష్టించి వివిధ ప్రభుత్వ ఖజానాల నుంచి రూ.950 కోట్లు వాడుకున్న విషయం బయటపడింది. తాజాగా ఈ కేసులో లాలూకు సీబీఐ కోర్టు జైలుశిక్ష విధించింది.

Exit mobile version