Man Posts Own Obituary: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు పెరిగాయి. కొందరు ఈ ఆత్మహత్యలను లైవ్ ప్రసారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కేరళకు చెందిన ఓ వ్యక్తి తన మరణానికి తానే నివాళులు అర్పిస్తూ ‘‘RIP’’ పోస్టు పెట్టి, ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Also: Rishi Sunak: డౌనింగ్ స్ట్రీట్ బయట లాక్ అయిన రిషి సునాక్, డచ్ ప్రధాని.. ఏం జరిగిందంటే..
కేరళలోని అలువాకు చెందిన 28 ఏళ్ల వ్యక్తి తన ఇన్‌స్టాగ్రమ్ పేజీలో తన మరణవార్తను పోస్టుగా పెట్టి ఆత్మహత్యు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అజ్మల్ తన ఫోటోతో పాటు ‘RIP అజ్మల్ షెరీఫ్ 1995-2003’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో అజ్మల్ షరీఫ్ అనే వ్యక్తి తన ఇంట్లోఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంచి ఉద్యోగం రాకపోవడంతో కాస్త డిప్రెషన్‌లో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత అజ్మల్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అజ్మల్ ఇన్‌స్టాగ్రామ్ జేపీకి 14 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.