Site icon NTV Telugu

RG Kar rape case: సంజయ్ రాయ్ శిక్షపై హైకోర్టులో సీబీఐ సవాల్.. ఏం కోరిందంటే..!

Rgkarrapecase

Rgkarrapecase

కోల్‌కతా ఆర్‌జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్‌రాయ్‌కి ఇటీవల న్యాయస్థానం జీవితఖైదు విధించింది. అయితే ఈ తీర్పుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. తీర్పును వ్యతిరేకిస్తూ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. అయితే ఈ వాదనను సీబీఐ తోసిపుచ్చింది. డిమాండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదని.. దర్యాప్తు సంస్థకే ఉంటుందని సీబీఐ పేర్కొంది. దీంతో నిందితుడికి మరణశిక్ష విధించాలని సీబీఐ హైకోర్టును కోరింది.

ఇది కూడా చదవండి: Post Office Scheme: లక్షాధికారిని చేసే స్కీమ్.. రోజుకు రూ.50 పెట్టుబడితో.. రూ.35 లక్షల లాభం!

సంజయ్ రాయ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సీబీఐ బుధవారం హైకోర్టును ఆశ్రయించింది. న్యాయమూర్తులు దేబాంగ్షు బసక్, ఎండీ షబ్బర్ రషీదీలతో కూడిన డివిజన్ బెంచ్ ముందు విచారణ సందర్భంగా.. శిక్షను సవాలు చేసే అధికారం ఈ కేసులో ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీకి మాత్రమే ఉందని సీబీఐ పేర్కొంది. ఈ కేసును తాము విచారించినందున ఈ విషయంలో అప్పీల్‌కు దాఖలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని దర్యాప్తు సంస్థ పేర్కొంది. రాష్ట్రం తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్… సీబీఐ వాదనను తిప్పికొడుతూ.. ఈ కేసులో ప్రాథమిక ఎఫ్‌ఐఆర్‌ను రాష్ట్ర పోలీసులు దాఖలు చేశారని, ఆ తర్వాత కేసును సీబీఐకి బదిలీ చేశారని చెప్పారు. ‘‘లా అండ్ ఆర్డర్ రాష్ట్ర అధికార పరిధిలో ఉంది’’ అని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను అంగీకరించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే ముందు.. సీబీఐ, బాధితురాలి కుటుంబం, సంజయ్ రాయ్ సమర్పించిన సమర్పణలను పరిశీలిస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుపై సోమవారం (జనవరి 27) తదుపరి విచారణ జరగనుంది.

ఇది కూడా చదవండి: Enemy Act: సైఫ్ అలీ ఖాన్ రూ. 15,000 కోట్ల ఆస్తి కోల్పోయే అవకాశం.. ‘‘ఎనిమి ప్రాపర్టీ’ అంటే ఏమిటి..?

ఆగస్టు 9, 2024న కోల్‌కతా ఆర్‌జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. తాజాగా న్యాయస్థానం కూడా దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది. ఇదిలా ఉంటే ఈ తీర్పుపై బెంగాల్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. తాజాగా సీబీఐ ఈ వాదనను తోసిపుచ్చి.. తమకే ఆ అధికారం ఉందని తెలిపింది.

ఇది కూడా చదవండి: Saraswati Power Plant Lands: ప్రభుత్వం కీలక నిర్ణయం.. సరస్వతీ ల్యాండ్స్ రద్దు..

Exit mobile version