Student Suicide: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో గల ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పేరు గత కొంత కాలం నుంచి మారుమ్రోగుతుంది. తాజాగా, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కమర్‌హతిలోని ఈఎస్‌ఐ క్వార్టర్స్ లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థిని తల్లి పలుమార్లు తలుపు తట్టింది.. ఎలాంటి స్పందన రాకపోవడంతో బలవంతంగా తలుపు తెరిచి చూడగా కూతురు ఉరి వేసుకుని కనిపించింది.. దీంతో ఇరుగుపొరుగు వారి సహాయంతో ఆమె తల్లి దగ్గరలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించగా.. వైద్యులు ఆమె చనిపోయినట్లు ధృువీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ ఘటనపై కమర్‌హతి పోలీస్ స్టేషన్‌లో అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.
Read Also: C.M.Ramesh: అసాంఘిక కార్యక్రమాలు పేట్రేగిపోతున్నాయి.. కలెక్టర్, ఎస్పీలకు లేఖ
కాగా, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు అని పోలీసులు తెలిపారు. అయితే, సదరు విద్యార్థి దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుందన్నారు. ఇక, ఆమె మానసిక ఆరోగ్యం క్షీణించడానికి కారణమైందని సూచించారు. డిప్రెషన్‌తో బాధపడి సూసైడ్ చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్నారు.