NTV Telugu Site icon

Same-Sex Marriage Case: స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్

Same Sex Marriage Case

Same Sex Marriage Case

Same-Sex Marriage Case: స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 17న ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం చట్టబద్ధమైన గుర్తింపుకు నిరాకరించింది. దీనిపై చట్టాలు రూపొందించే బాధ్యత పార్లమెంటుదే అని స్పష్టం చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పును వెల్లడించింది. స్వలింగ పెళ్లిళ్లు చేసుకునే ప్రాథమిక హక్కు లేదని స్పష్టం చేసింది.

Read Also: Raghav Chadha: కేజ్రీవాల్‌ని జైలులో వేసి, 7 సీట్లు గెలవండి.. ఆప్ నేత విమర్శలు..

అయితే దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. స్వలింగ వివాహం కేసులో పిటిషనర్లలో ఒకరు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ కిషన్ కౌల్ స్వలింగ భాగస్వాముల గుర్తింపు కోసం వాదించారు. LGBTQIA+ వ్యక్తుల హక్కులను కాపాడేందుకు వివక్ష వ్యతిరేక చట్టాల కోసం వీరు పోరాడారు.

ఐదుగురు న్యాయమూర్తలు బెంచ్ ఇలాంటి జంటలు దత్తత తీసుకోవడం, సివిల్ యూనియన్ గుర్తింపును అంగీకరించలేదు. దత్తతకు వ్యతిరేకంగా 3:2 తీర్పు ఇచ్చింది. ఇలాంటి జంటల సంబంధాన్ని ‘వివాహం’గా చట్టబద్ధంగా గుర్తించకుండా, వారి హక్కులు, అర్హతలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.