Site icon NTV Telugu

Manipur: సర్జికల్ స్ట్రైక్ హీరోకి మణిపూర్ బాధ్యతలు..

Nectar Sanjenbam

Nectar Sanjenbam

Manipur: జాతులు మధ్య ఘర్షణతో మణిపూర్ అట్టుడుకుతోంది. మైయిటీ, కూకీ జాతుల మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో మయన్మార్ లో సర్జికల్ స్ట్రైక్ చేసిన పారాకమాండోకు కీలక బాధ్యతను అప్పచెప్పింది. ప్రస్తుతం ఆయన రిటైల్ అయినా మణిపూర్లో పరిస్థితి శాంతిని నెలకొల్పేందుకు ఈ రిటైర్ ఆర్మీ అధికారి సాయం తీసుకుంటున్నారు.

రిటైర్డ్ కల్నల్ నెక్టార్ సంజెన్‌బామ్ ని ఇటీవల మణిపూర్ ప్రభుత్వం రాష్ట్ర పోలీసులు కాంబాట్ విభాగానికి సీనియర్ సూపరింటెండెంట్ గా నియమించింది. ఈ పదవిలో ఆయన 5 ఏళ్లు కొనసాగనున్నారు. మూడు నెలల క్రితం మణిపూర్ రాష్ట్ర మంత్రివర్గం ఆయన నియామకంపై నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను కట్టడి చేసేందుకు ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

గతంలో నెక్టార్ సంజెన్‌బాయ్ సైన్యంలోని 21 పారా స్పెషల్ ఫోర్స్ లో పనిచేశారు. సైన్యం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన కీర్తిచక్ర, శౌర్యశక్ర అవార్డులను అందుకున్నారు.

Read Also: Early Elections: లోక్‌సభ ముందస్తు ఎన్నికలు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..

2015 సర్జికల్ స్ట్రైక్‌లో కీలకం:

2015 మయన్మార్ లో భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ లో నెక్టార్ కీలక పాత్ర పోషించారు. 2015 జూన్ లో డోగ్రా బెటాలియన్ పై మణిపూర్ చండేల్ జిల్లాలో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 18 మంది సైనికులు మరణించారు. ఈ ఘటనను మోదీ ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సరిహద్దు దేశం మయన్మార్ లో ఉన్నారనే సమాచారంతో, సైన్యంతో అత్యున్నతమైన పారా కమాండోలను రంగంలోకి దించింది. జూన్ 8-9 రాత్రి సమయంలో పారా ఎస్ఎఫ్ టీం మయన్మార్ అడవుల్లోకి ప్రవేశించి అక్కడ దాగి ఉన్న 20 మంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టి ప్రతీకారం తీర్చుకుంది. ఈ సాహసోపేత ఆపరేషన్ తర్వాత టీంలోని 8 మమది సభ్యులకు ఆగస్టు 15న మకేంద్రం గ్యాలెంట్రీ అవార్డులను అందించింది.

Exit mobile version