Ukraine: ఉక్రెయిన్ ప్రధాని డేనిస్ హ్మిహాల్ ప్రధాని నరేంద్రమోడీని ‘గ్లోబల్ లీడర్’ అని ప్రశంసించారు. యుద్ధంతో దెబ్బతిన్న తమ దేశ ఆర్థిక వ్యవస్థను పునురద్ధరించడానికి భారత్ సాయం చేయాలని కోరాడు. భారత విద్యార్థులను తమ దేశానికి పంపండం ద్వారా మునుపటిలా వాణిజ్యం చేయడం ద్వారా భారతదేశాన్ని సాయం చేయాలని అభ్యర్థించాడు.
Read Also: Nitrogen Death: అమెరికాలో సరికొత్త మరణశిక్ష.. నైట్రోజన్‌తో 7 నిమిషాల్లోనే..!
జాతీయ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హ్మిహాల్ మాట్లాడుతూ.. భారత్, ఉక్రెయిన్‌కి అతిపెద్ద ఆర్థిక భాగస్వాముల్లో ఒకటని, దేశానికి సాయం, మానవతా మద్దతును అందించిందందుకు పీఎం మోడీని ప్రశంసించారు. ప్రపంచశాంతి కోసం కృషి చేస్తున్న ప్రపంచ నాయకుడు ప్రధాని మోడీ అని.. ఉక్రెయిన్ లో ఎక్కువ భాగం ప్రస్తుతం శాంతిగా ఉందని అన్నారు.
2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్ ‘ఆపరేషన్ గంగా’ ద్వారా భారతీయ విద్యార్థులు 18000 మందిని స్వదేశానికి తీసుకువచ్చింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఆర్థిక క్షీణత కనిపించింది.
