NTV Telugu Site icon

Darshan Case: యాక్టర్ దర్శన్ కేసులో కీలక పరిణామం.. సీఎం సిద్ధరామయ్యని కలిసిన రేణుకాస్వామి పేరెంట్స్..

Darshan

Darshan

Darshan Case: కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతని అభిమాని రేణుకాస్వామిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనలో దర్శన్‌తో పాటు అతని లివింగ్ పార్ట్‌నర్ పవిత్రగౌడతో సహా మొత్తం 17 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. తన అభిమాన హీరో కాపారాన్ని కూల్చిందనే కోపంతో పవిత్రగౌడని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు రేణుకాస్వామి హత్య జరిగింది. చిత్రదుర్గకి చెందిన స్వామిని కిడ్నాప్ చేసి, బెంగళూర్‌లోని ఓ షెడ్డులో చిత్ర హింసలు పెట్టారు. తీవ్రంగా కర్రలతో చితకబాదడంతో పాటు కరెంట్ షాక్ పెట్టడం, వృషణాలపై బలమైన గాయాల కారణంగా స్వామి మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.

Read Also: Kejriwal: బెయిల్‌పై హైకోర్టులో లభించని ఊరట.. జైల్లోనే ఉండనున్న కేజ్రీవాల్

ఇదిలా ఉంటే, ఈ కేసులో కీలక పరిణామం ఎదురైంది. రేణుకాస్వామి తల్లిదండ్రులు ఈ రోజు బెంగళూర్‌లో సీఎం సిద్ధరామయ్యను కలిశారు. స్వామి కేసులో ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. హత్య కేసు విచారణలో సంతృప్తి వ్యక్తం చేసిన స్వామి పేరెంట్స్ తమ కోడలికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎంను కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి, కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

దర్శన్ అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉన్నందున జూన్ 11 న అరెస్టు చేశారు. దర్శన్‌ను జూలై 4 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. స్వామిని చంపడానికి దర్శన్ అభిమాన సంఘం సభ్యుడిని పురమాయించారు. మరణించిన తర్వాత స్వామి శరీరాన్ని పారేసేందుకు రూ. 30 లక్షలు ఇచ్చాడనే అభియోగాలను దర్శన్ ఎదుర్కొంటున్నారు.