NTV Telugu Site icon

Actor Darshan: జైలులో దర్శన్‌కి వీఐపీ ట్రీట్‌మెంట్.. రేణుకాస్వామి తండ్రి ఆవేదన..

Darshan

Darshan

Actor Darshan: కన్నడ స్టార్ దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో జైలులో ఉన్నాడు. అయితే, అతడికి జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఫోటోలో జైలు పరిసరాల్లో ఓ చేతిలో కాఫీ కప్, మరో చేతిలో సిగరేట్ పట్టుకుని తాగుతుండటం కనిపిస్తోంది. ప్రస్తుతం అతను బెంగళూర్‌లోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నాడు. అతనితో పాటు కొంతమంది రౌడీషీటర్ ఖైదీలు కూడా కనిపిస్తారు. ఈ వారం ప్రారంభంలో బెంగళూరు కోర్టు దర్శన్ తూగుదీప, పవిత్ర గౌడ మరియు 15 మంది సహచరుల జ్యుడిషియల్ కస్టడీని ఆగస్టు 28 వరకు పొడిగించింది.

Read Also: Eme Subbamma Idiye Eme Katha: ‘ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ’ సినిమా ప్రారంభం.

అయితే, దర్శన్‌కి ఇలాంటి సౌకర్యాలు కల్పించడం పట్ల రేణుకాస్వామి తండ్రి కాశీనాథ శివనగౌడర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నటుడిపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరాడు. ‘‘దర్శన్ ఇంటి భోజనం అడిగినప్పుడు, కోర్టు అందుకు అనుమతించలేదు. మాకు పోలీసులు, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. ఇది ఎలా జరిగిందో అని ఆశ్చర్యమేస్తోంది. ఇది నాకు షాకింగ్ న్యూస్. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను.’’ అని ఆయన కోరారు. దర్శన్‌పై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

జూన్ నెలలో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో ఇరుక్కున్నాడు. దర్శన్, పవిత్ర గౌడతో సహజీవనం చేయడంపై అతను అనుచిత వ్యాక్యలు చేశాడనే కోపంతోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బెంగళూర్ తీసుకువచ్చి దారుణంగా కొట్టి చంపాను. జూన్ 9న బెంగళూర్ లోని ఓ ప్లైఓవర్ సమీపంలో రేణుకాస్వామి మృతదేహం కనిపించింది. పోస్టుమార్టం నివేదికలో అతను షాక్, రక్తస్రావం, అనేక గాయాల కారణంగా మరణించినట్లు తేలింది.

Show comments