Site icon NTV Telugu

Renuka Chowdhury: ఆర్మీ జనరల్స్‌పై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

Renuka Chowdhury

Renuka Chowdhury

ఆర్మీ జనరల్స్‌పై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడాలని ఆర్మీ జనరల్స్‌పై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆర్మీ ఆఫీసర్లే చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయినప్పుడు రేణుకా చౌదరి కుక్కను తీసుకొచ్చి హల్‌చల్ చేశారు. అయితే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ధ్వజమెత్తారు.

అయితే బీజేపీ ఎంపీల డిమాండ్‌పై రేణుకా చౌదరి మండిపడ్డారు. తన కుక్క ఏమి చేయదని.. ప్రమాదంలో ఉంటే రక్షించినట్లుగా చెప్పుకొచ్చారు. ఈ కుక్కలు ఏమి చేయవు గానీ.. పార్లమెంట్ లోపల ఉన్న కుక్కలు మాత్రం కరుస్తాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలంటూ ఆర్మీ ఆఫీసర్లపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ ఆరోపణలపై కేంద్ర పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Exit mobile version