Site icon NTV Telugu

Saroj Amber Kothare: ప్రముఖ ప్రొడ్యూసర్ సరోజ్ అంబర్ కొఠారే కన్నుమూత..

Saroj Amber Kothare

Saroj Amber Kothare

Saroj Amber Kothare: ప్రముఖ ప్రొడ్యూసర్ సరోజ్ అంబర్ కొఠారే ఏకే జెన్మా కన్నుమూశారు. 93 ఏళ్ల వయస్సులో అనారోగ్య కారణాలతో మరణించారు. తన భర్తతో కలిసి ఆర్టిస్ట్ కంబైన్ అనే రంగస్థల నిర్మాణ సంస్థను స్థాపించి, ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సరోజ్ అంబర్ కొఠారే చనిపోయారు. ఆమె ఓ నటిగా, కలరిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యాల కారణంగా ఆమె శనివారం మరణించారు. ఆమె మరణాన్ని కుమారుడు, ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు మహేష్ కొఠారే శనివారం ప్రకటించారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తల్లికి నివాళి అర్పించారు. ‘‘సరోజ్ అంబర్ కొఠారే జెన్మా. కొఠారే కుటుంబం మొత్తం హృదయపూర్వక నివాళులు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం’ అని మరాఠీలో పేర్కొన్నారు. కొద్ది నెలల క్రితం తండ్రిని కోల్పోయిన మహేష్ కొఠారే.. తాజాగా తల్లిని కూడా కోల్పోయారు. ఆయన తండ్రి అంబర్ కొఠారే ఈ ఏడాది జనవరి 21వ తేదీన తన 96 ఏళ్ల వయస్సులో చనిపోయారు.

Read also: Chandrayaan-3: చంద్రయాన్‌-3 తొలి అడుగు విజయవంతం.. 41 రోజుల తర్వాత శాస్త్రవేత్తలకు అసలైన సవాల్‌

సరోజ్ అంబర్ కొఠారే ప్రముఖ వ్యక్తి మాధవరావు తల్పాడేకు 1930 జూన్ 19వ తేదీన జన్మించారు. ఆమె ప్రముఖ కలరిస్ట్, నటిగా పేరు తెచ్చుకున్నారు. 1952 లో ఆమె అంబర్ కొఠారేను వివాహం చేసుకున్నారు. తరువాతి కాలంలో ఈ దంపతులు ఆర్టిస్ట్ కంబైన్ అనే రంగస్థల నిర్మాణ సంస్థను స్థాపించింది.
అక్కడ వారు వివిధ రకాల నాటకాలను ప్రదర్శించేవారు. జెన్మా, ఆమె భర్త అంబర్ కొఠారే లగ్నాచి బేడీ, జోపి గెలా జసా జాలా తదితర చిత్రాల్లో కలిసి పనిచేశారు. అనంతర కాలంలో ఆమె కుమారుడు మహేష్ కొఠారే ధుమ్హడకతో తన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కెరీర్ ను ప్రారంభించారు. తరువాత ఆయనదే దానదన్, ధడకేబాజ్, జపట్ల, మజా చాకులా వంటి మరెన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించారు.

Exit mobile version