NTV Telugu Site icon

Draupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. తొలి గిరిజన మహిళగా రికార్డ్

Draupadi Murmu

Draupadi Murmu

Draupadi Murmu As 15th President: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలిచారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ముర్ము ఘన విజయం సాధించారు. ప్రపంచంలోొ అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశానికి తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డ్ సృష్టించారు. మూడు రౌండ్లు జరిగే సరికే ద్రౌపది ముర్ము సగానికి పైగా ఓట్లు సాధించారు. ఇంకో రెండు రౌండ్లు మిగిలి ఉండగానే రాష్ట్రపతిగా గెలుపొందారు. మూడు రౌండ్లు ముగిసే సరికి ద్రౌపది ముర్ము 5,77,777 ఓట్లను సాధించగా.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా 2,61,062 విలువైన ఓట్లను సాధించారు. ఈ నెల 25 ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చాలా రాష్ట్రాల్లో ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్ జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. మొత్తంగా రాష్ట్రపతి ఎన్నికల్లో 10.80 లక్షల ఓట్లలో సగానికి పైగా ఓట్లు ముర్ముకు పడ్డాయి. ఎన్డీయే అభ్యర్థి ముర్ముకు 44 పార్టీలు మద్దతు ఇస్తే, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 34 పార్టీలు మద్దతు ఇచ్చాయి. తాజాగా ఎన్నికల్లో 68.87 శాతం ఓట్లు రాగా..31.1 శాతం ఓట్లు సాధించారు.

మొత్తంగా ఎన్నిక ముగిసే సమయానికి 4754 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 4701 ఓట్లు చెల్లుబాలు అవ్వగా..53 చెల్లిన ఓట్లుగా తేలాయి. ఇందులో ద్రౌపది ముర్ము 2824 మొదటి ప్రాధాన్యత ఓట్లు పొందారు. వీటి మొత్తం విలువ 6,76,803గా ఉంది. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 1,877 ఓట్లు వచ్చాయి. వీటి విలువ 3,80,177 గా ఉంది. మొదటి ప్రాథాన్యత ఓట్లలోనే మెజారిటీ రావడంతో ద్రౌపది ముర్మను 15వ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి హోదాలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ప్రకటించారు. గతంలో విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇచ్చిన శివసేన వంటి పార్టీల ప్రజాప్రతినిధులు కూడా ద్రౌపది ముర్ముకు ఓటేశారు. ఎన్డీయే కూటమి పార్టీలతో పాటు బీఎస్పీ, వైసీపీ, బీజేడీ, అకాళీ దళ్ వంటి పార్టీలు ద్రౌపది ముర్ముకు మద్దతుగా నిలిచాయి. వరసగా మూడు రౌండ్లలో ద్రౌపతి ముర్ము భారీ ఆధిక్యాన్ని కనబరిచారు. రాష్ట్రపతిగా గెలుపొందిన ద్రౌపది ముర్ముకు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ తో పాటు ప్రధాని మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ద్రౌపది ముర్ము ఇంటికి వెళ్లారు.