Site icon NTV Telugu

PM Modi: 2025లో మోడీ నాయకత్వంలో అద్భుత ఘట్టాలు ఇవే!

2025 సంవత్సరం కొన్ని గంటల్లో ముగియనుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది ప్రధాని మోడీ వివిధ కార్యక్రమాలు, పర్యటనలు, విజయాలను సొంతం చేసుకున్నారు. ఆపరేషన్ సిందూర్, అయోధ్యలో ధ్వజారోహణ ఉత్సవం, దేవాలయాల సందర్శన, సరిహద్దు ప్రాంతాలు, ప్రజలతో మమేకం.. ఇలా ఎన్నో ఉన్నాయి. వాటికి సంబంధించిన చిత్రాలపై ఒక లుక్కేద్దాం.

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ప్రధాని మోడీతో విద్యార్థుల బృందం సెల్ఫీ తీసుకుంది.

అహ్మదాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో ప్రధాని మోడీని చూసి ఒక మహిళ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది.

 

చైనాలోని టియాంజిన్‌లో జరిగిన SCO సమ్మిట్ 2025లో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిశారు.

 

ఓ పిల్లాడితో ప్రధాని మోడీ సరదాగా గడిపిన దృశ్యాలు 

 

శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని మోడీకి ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇస్తూ వ్యక్తిగత సందేశం చూపించారు. 

ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు పాదరక్షలు వాడనని ప్రతిజ్ఞ చేసిన హర్యానాలోని రాంపాల్ కశ్యప్‌కు ప్రధాని మోడీ కృతజ్ఞతగా ఒక జత బూట్లు ఇచ్చారు. స్వయంగా మోడీనే ధరింపజేశారు.

 

న్యూఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాని మోడీ రక్షా బంధన్ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఆడుకుని రాఖీ కట్టించుకున్నారు. 

 

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా జరిగిన కీలకమైన సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, NSA అజిత్ దోవల్, CDS జనరల్ అనిల్ చౌహాన్, సాయుధ దళాల అధిపతులు, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. 

 

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిర్ ధ్వజారోహణ ఉత్సవ్‌కు తరలివచ్చిన ప్రజలకు ప్రధాని మోడీ అభివాదం చేశారు. 

Exit mobile version