Site icon NTV Telugu

Supreme Court: రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట కేసు.. హీరో షారుఖ్‌ఖాన్‌కు ఊరట

Sharukh Khan

Sharukh Khan

Supreme Court: సుప్రీంకోర్టులో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌కు ఊరట లభించింది. గుజరాత్ వడోదర రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట కేసును కొట్టివేయాలంటూ గతంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. ‘రాయిస్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా షారూఖ్ తన చిత్రబృందంతో కలిసి 2017లో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయనను చూసేందుకు వడోదర రైల్వే స్టేషన్‌కు పోటెత్తారు. షారూఖ్ వారిపై టీషర్టులు, స్మైలీ బాల్స్ విసిరారు. వీటిని చేజిక్కించుకునే ప్రయత్నంలో రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది.

Read Also: Disco Santi Emotional: బావ చనిపోయిన తర్వాత.. బాలయ్య ఒక్కరే కాల్​ చేశారు

అయితే రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటకు షారూఖ్ ఖాన్ కారణమయ్యారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జితేంద్ర మధుబాయ్ సోలంకి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును కొట్టివేయాల్సిందిగా కోరుతూ షారూఖ్ ఖాన్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసును విచారించిన కోర్టు షారూఖ్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. గుజరాత్ హైకోర్టు తీర్పును ఫిర్యాదుదారుడు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సోమవారం నాడు దీనిని విచారించిన జస్టిస్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం షారూఖ్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

Exit mobile version