Site icon NTV Telugu

Delhi Cabinet Ministers: రేఖా గుప్తాతో పాటు మంత్రులుగా ప్రమాణం చేసేది వీళ్లే..!

Delhi Cabinet

Delhi Cabinet

Delhi Cabinet Ministers: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈ రోజు (ఫిబ్రవరి 20) రేఖ గుప్తా రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా, ఆమెతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందులో, పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సిర్సా, పంకజ్ సింగ్, కపిల్ మిశ్రా, రవీంద్ర ఇంద్రజ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం పోటీ చేసి మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై విజయం సాధించిన పర్వేష్ వర్మ పేరు మొదటి నుంచి ముఖ్యమంత్రి రేసులో ఉంది. కానీ, అనుహ్యంగా బీజేపీ అధిష్టానం రేఖా గుప్తాను సీఎంగా ఎంపిక చేయడంతో పర్వేష్ వర్మకు కేబినెట్ లో చోటు కల్పించింది.

Read Also: Sri Lila: బాలీవుడ్‌లో శ్రీలీల రెమ్యునరేషన్ మరి అంత తక్కవ..!

ఇక, ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఎన్డీయే నేతల సమక్షంలో రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీ మర్లేనా తర్వాత ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్న నాలుగో మహిళగా ఆమె నిలవనుంది. అయితే, రామ్‌లీలా మైదానంలో ఈరోజు (ఫిబ్రవరి 20) జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్‌ షాతో పాటు ఎన్డీయే నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు.

Exit mobile version