Site icon NTV Telugu

Rekha Gupta: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలిసిన సీఎం రేఖా గుప్తా

Rekha Gupta

Rekha Gupta

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అలాగే ఉప రాష్ట్రపతి ధన్‌కర్‌ను కూడా కలిశారు. అనంతరం కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Skoda : బాంబే హైకోర్టు కీలక నిర్ణయం.. 12 వేల కోట్లు చెల్లించనున్న స్కోడా.. అసలేమైంది?

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో పాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. అంగరంగ వైభవంగా ఈ ప్రోగ్రామ్ జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా ఎన్డీఏ మిత్రపక్షాలు హాజరయ్యారు. గురువారమే రేఖా గుప్తా తొలి కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆమోదించారు. దీంతో రూ.10 లక్షల వైద్య సాయం అందనుంది. త్వరలో మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తామని రేఖా గుప్తా హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Sambhaji Maharaj: శంభాజీ మహారాజ్‌పై వివాదాస్పద కంటెంట్.. వికీపీడియా ఎడిటర్లపై కేసు..

 

Exit mobile version