Site icon NTV Telugu

Mumbai rain: 24 గంటల పాటు ముంబైలో రెడ్ అలర్ట్

Mdue

Mdue

ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో నీళ్లు నిలిచిపోయాయి. దీంతో ఇప్పటికే రైళ్లు, 50 విమానాలు రద్దు చేశారు. అలాగే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై వాసులు అల్లాడిపోతున్నారు.

ఇది కూాడా చదవండి: Mercedesbenz EV: ఇండియాలో మెర్సిడెస్ ఎలక్ట్రిక్ కారు విడుదల.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 560 కి.మీ

ఇదిలా ఉంటే ముంబైకి కేంద్ర వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని సూచించింది. 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పౌరసరఫరాల సంస్థ కోరింది. పుకార్లను నమ్మవద్దని కోరింది. సహాయం కోసం మెయిన్ కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నంబర్  1916కు డయల్ చేయాలని ప్రజలను కోరింది.

ఇది కూాడా చదవండి: Shocking VIDEO: ఏమరపాటుగా కారు పార్కింగ్.. క్షణాల్లో ఏం జరిగిందంటే..!

Exit mobile version