PM Modi: నేడు జరుగుతున్న రోజ్‌గార్ మేళాలోనూ 71,000 మందికి పైగా యువతకు అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. వారిలోని సామర్థ్యాలను వినియోగించుకోవడం ద్వారా సర్కార్ మరింత ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు తమ పాలనలో యువతకు పెద్ద మొత్తంలో కేంద్ర ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గత ఒకటిన్నర ఏళ్లలో ఏకంగా 10 లక్షల ఉద్యోగాలిచ్చాం.. దేశ చరిత్రలో ఇది పెద్ద రికార్డ్ అని ప్రధాని మోడీ వెల్లడించారు.
Read Also: Film Chamber Committee: రేవతి కుటుంబానికి అండగా తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
ఇక, ఉద్యోగాలు పొందిన వారందరూ నిజాయతీతో దేశం కోసం పని చేస్తున్నారని ప్రధాని మోడీ తెలిపారు. 2047 కల్లా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. దేశ అభివృద్ధి యువత పైనే ఆధారపడి ఉంది.. గత ప్రభుత్వాలు సరైన ఉపాధి కల్పించకపోవడంతో దేశం వెనకబడిపోయిందని ఆయన చెప్పారు. తమ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. మేక్‌ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ప్రస్తుతం భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది.. అంతరిక్షం, రక్షణ, పునరుత్పాదక ఇంధనం, టూరిజం రంగాల్లో భారత్ అగ్రగామిగా ఎదిగిందని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.