Site icon NTV Telugu

Online Trolling: ఆన్‌లైన్ ట్రోలింగ్‌కి మేము కూడా బాధితులమే: సుప్రీంకోర్టు

Online Trolling

Online Trolling

Online Trolling: దేశంలో అత్యున్నత సంస్థలు కూడా ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌కి అతీతం కాదని ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పింది. సోషల్ మీడియా ట్రోల్స్‌ని, వారి చర్యలని దారుణంగా అభివర్ణించింది. ‘‘మనం ఎవరికైనా అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేస్తే, అవతలి వర్గం న్యాయమూర్తిని ట్రోల్ చేస్తారు’’ అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సోమవారం అన్నారు. ఆప్ నేత, రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడి చేసిన కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

Read Also: Vijayawada – Hyderabad: ప్రయాణికులకు ఉపశమనం.. విజయవాడ-హైదరాబాద్‌ మధ్య రాకపోకలకు లైన్‌ క్లియర్‌

‘‘సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం దారుణం, ప్రతీ ఒక్కరూ ప్రభావితమవుతున్నారు. న్యాయమూర్తులు కూడా ట్రోల్స్‌కి గురవుతున్నారు.’’ అని మరో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. దీనిని పట్టించుకోకపోవడమే మంచిదని చెప్పారు. బాధ్యతారహితమైన వ్యక్తుల్లో చాలా మంది, దురదృష్టవశాత్తు ఈ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా ట్రోలింగ్‌కి పాల్పడుతున్నారని అన్నారు. వారు హక్కుల గురించి మాట్లాడుతారు తప్పితే, బాధ్యతల్ని విస్మరిస్తారని, వారు సంస్థల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతారని, వారిని పట్టించుకోవద్దని ఆయన అన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. స్వాతి మలివాల్ తరుపు న్యాయవాది తన క్లైయింట్‌ని టార్గెట్ చేస్తూ ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ పాల్పడుతున్నారని, అవమానిస్తున్నారని కోర్టుముందు చెప్పడంతో న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇతరు చేసే పనికి తన క్లైయింట్ బిభవ్ కుమార్ బాధ్యత వహించలేడని అతడి తరుపున వాదిస్తున్న అభిషేక్ సింఘ్వీ అన్నారు.

Exit mobile version