12th Fail: రియల్ లైఫ్ “12th ఫెయిల్” ఐపీఎస్ ఆఫీసర్, భార్యతో ఉన్న ఫోటోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
12th Fail: విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ‘12th ఫెయిల్’ మూవీ ఎంతో మంది యువతకు స్పూర్తినిస్తోంది. చిన్ని చిత్రంగా విడుదలై ఈ సినిమా విమర్శల ప్రశంసలను అందుకోవడమే కాకుండా.. రూ.20 కోట్లతో నిర్మిస్తే రూ. 66 కోట్లను వసూలు చేసింది. నిజజీవితంలో ఎన్నో కష్టాలు ఎదర్కోని యూపీఎస్సీ పరీక్షలను క్లీయర్ చేసి, ఐపీఎస్ అయిన మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
విక్రాంత్ మాస్సే మనోజ్ కుమార్ పాత్ర పోషించగా.. అతనికి ప్రేరణగా నిలిచిన ప్రియురాలు శ్రద్ధా జోషి పాత్రలో మేధా శంకర్ అద్భుతంగా నటించారు. ఐపీఎస్ కావడానికి మనోజ్ కుమార్ పడిన కష్టాలను, ఎన్ని అవాంతరాలు ఎదురైనా తన లక్ష్యాన్ని చేరుకునే వరకు సాగించిన పోరాటాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టేలా చూపించారు. ప్రేయసిగా, స్నేహితురాలిగా శ్రద్ధాజోషి, మనోజ్ కుమార్ శర్మకు అండగా నిలిచిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
Read Also: BJP: బీజేపీ టార్గెట్ 400.. ప్రతిపక్ష ఎంపీలను చేర్చుకునేందుకు ప్యానెల్ ఏర్పాటు.!
తాజాగా రియల్ లైఫ్ ‘12th ఫెయిల్’ ఐపీఎస్ మనోజ్ కుమార్, అతని భార్య శ్రద్ధా జోషిల పాత ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మనోజ్ కుమార్ శర్మ ఎక్స్(ట్విట్టర్)లో తనకు పెళ్లైన కొన్ని రోజుల తర్వాత భార్య శ్రద్ధా జోషితో తీసుకున్న ఫోటోను షేర్ చేశారు. ‘‘పెళ్లయిన కొన్ని రోజుల తర్వాత తీసిన ఫోటో ఈ రోజు నాకు దొరికింది’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇది పోస్ట్ అయిన కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. కేవలం గంటలోనే 1,30,000 వ్యూస్ సొంతం చేసుకుంది. మనోజ్ కుమార్ శర్మ ఐపీఎస్ సాధించగా.. శ్రద్ధా జోషి 2007లో ఐఆర్ఎస్ సాధించారు.
शादी के कुछ दिन बाद का एक फ़ोटो मिला आज
….🙏 pic.twitter.com/kPqSsbcWt9— Manoj Sharma (@ManojSharmaIPS) January 10, 2024
- Tags
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!