NTV Telugu Site icon

Raj Thackeray: ఔరంగజేబుపై రాజ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు

Rajthackeray

Rajthackeray

ఔరంగజేబుపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు చరిత్ర తెలుసుకోవాలంటే వాట్సప్‌లో కాదని.. పుస్తకాలను చదవి చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. చరిత్రను కులం, మతం అనే కోణంలో చూడొద్దని రాజ్ ఠాక్రే హితవు పలికారు. ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఉన్న ఔరంగజేబు సమాధిని తొలగించాలంటూ ఇటీవల ఆందోళనలు జరిగాయి. అంతేకాకుండా నాగ్‌పూర్‌లో అల్లర్లు కూడా జరిగాయి. అంతేకాకుండా ఔరంగజేబును కొనియాడినందుకు సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ వివాదాల నేపథ్యంలో రాజ్ ఠాక్రే ఈ విధంగా స్పందించారు.

ఇది కూడా చదవండి: Maoist Party: కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

మార్చి 30న గుడిపడ్వా సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో రాజ్ ఠాక్రే పాల్గొని మాట్లాడారు. మొఘలులు… ఛత్రపతి అనే ఆలోచనను చంపేయాలనుకున్నారు. కానీ సాధ్యమైందా? చివరికి మహారాష్ట్రలోనే చనిపోయారు. ఏదైనా చరిత్ర కావాలంటే పుస్తకాలు చదవాలి అంతేకానీ వాట్సప్‌లు కాదన్నారు. ప్రతి ఒక్కరూ శివాజీకి ముందు.. ఆ తర్వాత జరిగిన రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో చాలా మార్పులు జరిగాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఏ మాత్రం భావ్యం కాదన్నారు. ఔరంగజేబు ఎక్కడ జన్మించారో అన్న విషయం మరిచిపోవదని హితవు పలికారు.

ఇది కూడా చదవండి: Priyanka Gandhi: కేరళలో ప్రియాంక గాంధీ కాన్వాయ్ ని అడ్డుకున్న యూట్యూబర్ అరెస్ట్