Site icon NTV Telugu

Gujarat Cabinet: 26 మందితో కేబినెట్ విస్తరణ.. మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం

Ravindra Jadeja

Ravindra Jadeja

దీపావళి పండుగకు మందు గుజరాత్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరిగాయి. శుక్రవారం కేబినెట్ విస్తరణ అట్టహాసంగా జరిగింది. 26 మందితో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇందులో హర్ష్ సంఘవి కొత్త డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయగా.. రివాబా జడేజా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

గురువారం అనూహ్యంగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా 16 మంది మంత్రులు రాజీనామాలు చేశారు. ఇక కొన్ని గంటల వ్యవధిలోనే 26 మందితో కొత్త కేబనెట్ ఏర్పాటు జరిగిపోయింది. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లోని రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

ఇది కూడా చదవండి: IRCTC: పనిచేయని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌.. దీపావళి ప్రయాణికుల ఆందోళన

182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీలో గరిష్టంగా 27 మంది మంత్రులు ఉండవచ్చు. మునుపటి మంత్రివర్గంలో మొత్తం 17 మంది సభ్యులు ఉన్నా. ఎనిమిది మంది కేబినెట్ హోదాను కలిగి ఉండగా.. మిగిలినవారు సహాయ మంత్రులుగా పనిచేశారు. తాజాగా 26 మందితో మంత్రివర్గ విస్తరణ జరిగింది. గుజరాత్‌లో పాలనా నిర్మాణాన్ని బలోపేతం చేయడం. పరిపాలనలో కొత్త శక్తిని నింపడానికి మంత్రివర్గ విస్తరణ జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Zubeen Garg Death: జుబీన్ గార్గ్ మరణంపై సింగపూర్ పోలీసులు కీలక ప్రకటన

Exit mobile version