TATA vs Pakistan Economy: భారత పారిశ్రామిక దిగ్గజం, గొప్ప మానవతావాది, ఫిలాంత్రోపిస్ట్ రతన్ టాటా కన్నుమూశారు. 86 వయసులో ఆయన స్వర్గస్తులయ్యారు. అయితే, గుండు సూది నుంచి విమానం వరకు, ఉప్పు నుంచి ఆటోమోబైల్స్ వరకు టాటా వస్తువులు లేని ఇళ్లు భారతదేశంలో లేదంటే అతిశయోక్తి కాదు. అయితే, దాయాది దేశం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కన్నా టాటా గ్రూప్ మొత్తం విలువే ఎక్కువ.
Read Also: Donald Trump: ‘‘మోడీ అద్భుతమైన వ్యక్తి’’.. పాకిస్తాన్‌కి ధమ్కీ ఇచ్చిన విషయాన్ని చెప్పిన ట్రంప్..
భారత్ కన్నా మేమేం తక్కువ కాదు అని విర్రవీగే పాకిస్తాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థ, మన దేశ టాటా గ్రూపు కన్నా దిగదుడుపే. టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 400 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది. 2024 చివరి నాటికి పాక్ ఆర్థిక వ్యవస్థ విలువ 347 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో టాటా తన సంస్థని విస్తరించారు. 1868లో స్థాపించబడిన టాటా గ్రూప్ భారతదేశంలో పురాతన పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా ఉపాధిని కల్పిస్తుంది. ఒక్క టీసీఎస్ సంస్థలోనే 6,15,000 మంది ఉద్యోగులు ఉన్నారు.