Site icon NTV Telugu

Dunki: “డంకీ”కి అరుదైన గౌరవం.. రాష్ట్రపతి భవన్‌లో స్క్రీనింగ్..

Dunki

Dunki

Dunki: బాలీవుడ్ సూపర్ స్టార్, కింగ్ ఖాన్ నటించిన ‘డంకీ’ మూవీకి అరుదైన గౌరవం లభించింది. తాజాగా విడుదలై ఈ సినిమా నార్త్ ఇండియాతో పాటు, ఓవర్సీస్‌లో దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఈ రోజు రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం తెలిపింది.

Read Also: Telangana: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌ బదిలీ

రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ‘డంకీ’ సినిమా ప్రధానంగా ఇమ్మిగ్రేషన్ సమస్యలపై దృష్టి పెట్టింది. అక్రమ మార్గాల్లో విదేశాలకు చేరుకోవాలనుకునే వారి కష్టాలను ఈ సినిమా ప్రస్తావించింది. షారూఖ్ ఖాన్‌తో పాటు విక్కీ కౌశల్, తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ ప్రధాన తారాగణంగా ఉన్నారు. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా డంకీ థియేటర్లలోకి వచ్చింది. మిక్సుడ్ టాక్‌తో మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటి వరకు దేశంలో రూ.74.82 కోట్లు వసూలు చేసింది.

ప్రస్తుతం ప్రభాస్ సలార్‌తో డంకీ పోటీ పడుతోంది. డంకీతో పోలిస్తే సలార్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో వసూళ్ల పరంగా చూస్తే సలార్, డంకీని అధిగమించింది. పఠాన్, జవాన్ తర్వాత ఈ ఏడాది డంకీ షారూఖ్ ఖాన్‌కి మూడో సినిమా.

Exit mobile version