Ranya Rao: ‘‘నా గుండె పగిలింది’’.. నటి రన్యారావు వ్యవహారంపై తండ్రి ఆవేదన..
- సంచలనంగా నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు..
- తండ్రి, మాజీ డీజీపీ రామచంద్రరావు ఆవేదన..
- తన గుండె పగిలిందని పేర్కొంటూ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranya Rao: కన్నడ నటి రన్యారావు అక్రమ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక డీజీపీ, కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారి కె రామచంద్రరావు కుమార్తె కావడంతో ఈ వ్యవహారం మరింతగా వార్తల్లో నిలిచింది. తన కుమార్తె బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఒక అధికారిగా కాకుండా ‘‘గుండె పగిలిన తండ్రి’’గా మాట్లాడుతూ, తన కుమార్తె స్మగ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తనకు తెలియదని చెప్పారు. ఆమె అరెస్ట్ గురించి మీడియా నివేదికల ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. ‘‘ఇటీవలి పరిణామాల వల్ల నాకు కలిగిన షాక్, బాధ, విధ్వంసాన్ని ఏ పదాలు నిజంగా వ్యక్తపరచలేవు’’ అని ఆయన అన్నారు. తాను ఎల్లప్పుడూ తన కర్తవ్యాన్ని నిజాయితీతో నిర్వహిస్తున్నానని చెప్పారు. ప్రజలు, మీడియాలు న్యాయంగా వ్యవహరించాలని ఆయన అభ్యర్థించారు.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
Read Also: YS Jagan: ఎక్కడా రాజీ పడొద్దు.. పార్లమెంట్లో గట్టిగా గళమెత్తండి.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం
మార్చి 3న బెంగళూర్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి రూ. 12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ రన్యా రావు పట్టుబడ్డారు. ఆమెను అధికారులు అరెస్ట్ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ప్రకారం, ఈ ఏడాది జనవరి నుండి 27 సార్లు ఆమె దుబాయ్‌కి వెళ్లింది, దీంతో వ్యవస్థీకృత స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో ఆమె ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2024లో రన్యా రావు జతిన్ హుక్కేరిని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి రన్యా తన భర్తతో కలిసి స్వతంత్రంగా జీవిస్తున్నట్లు ఆమె తండ్రి రామచంద్రరావు తన ప్రకటనలో పేర్కొన్నారు. పెళ్లి తర్వాత ఆమె తమ ఇంటికి రావడం కానీ, మేము వారి ఇంటికి వెళ్లడం కానీ జరగలేదని ఆయన చెప్పారు. ఇద్దరికి మధ్య స్పష్టమైన విభజన ఏర్పడినట్లు పేర్కొన్నారు. రన్యా రావు ఏదైనా చట్ట ఉల్లంఘనకు పాల్పడితే, చట్టం తన పని తాను చేసుకెళ్తుందని చెప్పారు.
తన కెరీర్లో ఒక్క మచ్చ కూడా లేదని చెప్పారు. అయితే, రామచంద్రరావు కెరీర్లో కూడా కొన్ని వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని వివాదాల్లో చిక్కుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2014 హవాలా కేసులో పెద్ద మొత్తంలో డబ్బు అదృశ్యమైందని, 2016లో నకిలీ ఎన్కౌంటర్లో ఇద్దరు గ్యాంగ్స్టర్ల మరణాలప సీఐడీ దర్యాప్తు ఉందని తెలుస్తోంంది. ప్రస్తుతం, రన్యా రావు 1962 కస్టమ్స్ చట్టం ప్రకారం జ్యుడీషియల్ కస్టడీలో ఉంది. ఆమె బెయిల్‌పై శుక్రవారం తీర్పు రానుంది.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!