Ramcharitmanas row: ఉత్తర్ ప్రదేశ్ లో రామచరితమానస్ వివాదం రచ్చరచ్చ అవుతోంది. ఇటీవల ఇటీవల బీహార్లో ఆర్జేడీ నేత రామచరిత్ మానస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ నేత, ఎమ్మెల్సీ స్వామి ప్రసాద్ మౌర్య కూడా రామచరిత మానస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై హిందూ మహాసభ ఆగ్రహం వ్యక్తం చేసింది. మౌర్య నాలుకను చీరేస్తే రూ.51000 రివార్డు ప్రకటించింది.
Read Also: Sharukh: మూసుకున్న థియేటర్స్ ని కూడా తెరిపిస్తున్నాడు… రియల్ పఠాన్
స్వామి ప్రసాద్ మౌర్య ఉత్తర్ ప్రదేశ్ లో ఓబీసీ నాయకుడు. రామచరితమానస్ లోని కొన్ని భాగాలు కుల ప్రాతిపదికను సమాజంలో కొన్ని కులాలను అవమానపరుస్తున్నాయని అన్నాడు. అందుకు రామచరితమానస్ ను నిషేధించాలని డిమాండ్ చేశారు. బ్రిటీష్ పాలనలో మహిళలకు చదవడం రాయడం హక్కు వచ్చిందని.. బ్రిటీస్ కాలంలో దళితులు చదవడం, రాయడం హక్కును పొందారని.. దేశ సంపందలో 60 శాతానికి పైగా 5 శాతం భారతీయులు మాత్రమే కలిగి ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై హిందూమహాసభ జిల్లా ఇంన్ఛార్జ్ సౌరభ్ శర్మ సోమవారం మాట్లాడుతూ.. మౌర్య మా మత గ్రంథాన్ని అవమానించారని.. హిందువలు మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. ధైర్యవంతులెవరైనా స్వామి ప్రసాద్ నాలుక నరికితే రూ.51,000 చెక్కును బహుమతిగా ఇస్తా అని అన్నారు. మౌర్య వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ.. అతడి దిష్టిబొమ్మను దగ్ధం చేసి యమున నదిలో పారాశారు.