Site icon NTV Telugu

Shraddha Walker Case: శ్రద్ధ ఆత్మగా తిరిగొచ్చి.. అఫ్తాబ్‌ని 70 ముక్కలు చేసి..

Rgv On Shraddha Walker

Rgv On Shraddha Walker

Shraddha Walker: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న శ్రద్ధా వాకర్ హత్య కేసుపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వింతగా స్పందించాడు. ఆ అమ్మాయి ఆత్మగా తిరిగొచ్చి, తనని కిరాతకంగా చంపిన అఫ్తాబ్‌ని 70 ముక్కలు చేయాలన్నాడు. ‘‘మరణించి విశ్రాంతి తీసుకోవడానికి బదులు.. శ్రద్ధ ఆత్మగా తిరిగొచ్చి, అతడ్ని 70 ముక్కలు చేయాలి. కేవలం చట్టం భయంతో ఇలాంటి హత్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరోధించలేం. మరణించిన వారు ఆత్మగా తిరిగొచ్చి, తమని హంతకుల్ని చంపినప్పుడే ఇలాంటి క్రైమ్స్‌ని ఆపగలం. దేవుడు దీనిని పరిగణనలోకి తీసుకొని, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా వర్మ ఆ భగవంతుడికి వింత అభ్యర్థన చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కాగా.. అఫ్తాబ్, శ్రద్ధా ఒక డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారడంతో, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ.. శ్రద్ధా తల్లిదండ్రులు అందుకు నిరాకరించడంతో, ఆ ప్రేమ జంట ఢిల్లీ వెళ్లింది. అప్పటినుంచి సహజవనం చేశారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా ఒత్తిడి చేసింది. పెళ్లి విషయంపై వీరి మధ్య చాలాసార్లు గొడవ జరిగింది. మే 18వ తేదీ కూడా ఘర్షన జరగడంతో, అఫ్తాబ్ ఆమె గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి, వాటిని ఫ్రిజ్‌లో పెట్టి, 18 రోజులపాటు వాటిని రాత్రివేళల్లో నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి విసిరేశాడు. షాకింగ్ విషయం ఏమిటంటే.. శ్రద్ధా శరీర భాగాలు ఫ్రిజ్‌లో ఉండగానే, అఫ్తాబ్‌ మరో యువతికి గాలం వేసి, ఆమెను పలుమార్లు తన అపార్ట్‌మెంట్‌కు రప్పించుకున్నాడు.

శ్రద్ధా నుంచి ఫోన్ కాల్స్ రాకపోవడం, సోషల్ మీడియాలోనూ స్పందన లేకపోవడంతో.. శ్రద్ధా సోదరుడు, స్నేహితులకు అనుమానం వచ్చింది. శ్రద్ధా తండ్రికి విషయం తెలియజేయగా, ఆయన ఢిల్లీలో వాళ్లు ఉండే ఫ్లాట్‌కు వెళ్లారు. అయితే, తాళం వేసి ఉండటంతో పోలీసుల్ని సంప్రదించారు. తొలుత పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఈ విస్తుగొలిపే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. శ్రద్ధా ముక్కల్ని ఫ్రిజ్‌లో ఉంచిన సమయంలో, అప్పుడప్పుడు ఆమె ముఖాన్ని బయటకు తీసి చూసేవాడని విచారణలో తేలింది.

Exit mobile version