Site icon NTV Telugu

పెద్ద‌ల స‌భ‌లోనూ అదే సిత్రం… చైర్మ‌న్ కంట‌త‌డి…

లోక్‌స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో స‌భ‌ను నిర‌వ‌ధిక వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే.  పెద్ద‌ల స‌భ‌గా పెరుపొందిన రాజ్య‌స‌భ‌లోనూ స‌భ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి విప‌క్షాలు నిర‌స‌న‌లు తెలియ‌జేశాయి.  ఎంపీలు నిల‌బ‌డి, బ‌ల్ల‌ల‌పైకి ఎక్కి పెద్ద‌గా నినాదాలు చేస్తూ నిర‌స‌న‌లు తెలిపారు.  విప‌క్షాల ఆందోళ‌న‌ల‌పై రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు అసంతృప్తి వ్య‌క్తం చేశారు.  ప్ర‌జాస్వామ్యానికి పార్ల‌మెంట్ ఒక దేవాలయం వంటిద‌ని, కొంద‌రు ఎంపీలు అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించార‌ని, పోడియం ఎక్కి నిర‌స‌న‌లు చేయ‌డం అంటే, గ‌ర్భ‌గుడిలో నిర‌స‌న‌లు చేయ‌డ‌మే అని రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు పేర్కొన్నారు.  స‌భ‌ను ఎక్కువ రోజులు స్థంబింప‌జేయ‌డం మంచిది కాద‌ని ఆయ‌న అయన అన్నారు.  నిన్న‌టి రోజున జరిగిన సంఘ‌ట‌న‌ను త‌ల‌చుకుంటే నిద్ర‌ప‌ట్టే ప‌రిస్థితులు లేవ‌ని అన్నారు.  ఈరోజు కూడా స‌భ ప్రారంభం కాగానే విప‌క్షాలు నిర‌స‌న‌లు చేయ‌డంతో స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.  

Read: అలెర్ట్‌ : తెలంగాణకు భారీ వర్షసూచన

Exit mobile version